టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ఇప్పుడు ఒక సంచలనం. ఈ సినిమా కోసం రాజమౌళి ఏ స్థాయిలో కష్టపడుతున్నారు అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా వేరే సినిమాలను పక్కన పెట్టి మరీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇతర సినిమాల కథలు వినిపించడానికి గత ఏడాది గా ఏ దర్శకుడు ట్రై చేసినా సరే హీరోలు ఇద్దరూ మాత్రం నో అంటున్నారు. 

 

అయితే త్రివిక్రమ్  మాత్రం ఎన్టీఆర్ కి కథ వినిపించడం ఆ కథను ఎన్టీఆర్ ఓకే చేయడం సినిమా మీద అధికారిక ప్రకటన రావడం వంటివి జరిగాయి. ఇప్పుడు ఈ విషయంలోనే రాజమౌళి అసహనంగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి జక్కన్న ఇప్పుడు పనులు పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో త్రివిక్రమ్ కాస్త ఎన్టీఆర్ ని తన సినిమా వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారట. 

 

లాక్ డౌన్ సమయంలో ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి గానూ త్రివిక్రమ్ కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని కాస్త హెయిర్ కట్ సహా గడ్డం ట్రిమ్ చెయ్యాలి అని కోరుతున్నట్టు సమాచారం. దీనిపై జక్కన్న ఆగ్రహంగా ఉన్నారట. షూటింగ్ అవ్వకుండా ఏ విధంగా ఎన్టీఆర్ తో మరో సినిమాకు రెడీ చేయిస్తావ్ అని అసహనం వ్యక్తం చేశాడ‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

ఎన్టీఆర్ రాజమౌళి సినిమా అనగానే ఇంకో ఆలోచన లేకుండా పూర్తి చేస్తూ ఉంటాడు. అలాంటి హీరో ని తన సినిమా అవ్వకుండా... త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ కోసం ప్రయత్నం చేయడం జక్కన్నకు ఆగ్రహం తెప్పించింది అంటున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ అనేది ఇండ‌స్ట్రీలో చాలా మందిలో తీవ్ర అస‌హ‌నానికి కార‌ణ‌మైంద‌న్న‌ది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: