3 సక్సెస్ ఫుల్ సీజన్ లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ కు రెడీ అవుతుంది. అసలైతే జూన్, జూలైలో బిగ్ బాస్ సీజన్ మొదలవ్వాల్సి ఉంటుంది. కానీ కరోనా ప్రభావంతో గత 40 రోజులుగా లాక్ డౌన్ ఉన్న కారణంగా ఆ ఎఫెక్ట్ బిగ్ బాస్ మీద పడుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మొదటి సీజన్ నుండి 3వ సీజన్ వరకు సెలెక్ట్ చేసి ఆపేసిన కొందరిని మళ్ళీ ఫోన్ లైన్ లోకి తెచ్చుకున్నారట. వారిలో కొందరు బిగ్ బాస్ సీజన్ 4కి ఎస్ అని చెబితే కొందరు సారీ అని చెబుతున్నారట. 

 

అయితే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్ కంటెస్టెంట్స్ గా కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో స్టార్ కంటెస్టెంట్స్ ఉండటం విశేషం. ఇంతకీ లీక్ అయిన లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.. హీరో అల్లరి నరేష్ తో పాటుగా నందు కూడా ఈ సీజన్ లో ఉంటాడని అంటున్నారు. ఇక కమెడియన్ తాగుబోతు రమేష్, యాంకర్ ఝాన్సీతో పాటుగా యూట్యూబ్ జోడీ సుడిగాలి  సుధీర్, రష్మీ గౌతమ్ లు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్స్ గా ఉంటారని తెలుస్తుంది. వీరితో పాటుగా కార్తీకదీపం దీప అదేనండి ప్రేమి విశ్వనాధ్ కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వస్తున్నారని తెలుస్తుంది. 

 

లీకైన లిస్ట్ ను బట్టి ఈసారి స్టార్ కంటెస్టెంట్స్ నే పట్టుకొచ్చేలా ఉన్నారు. అయితే ఈ లిస్ట్ నిజమేనా కాదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. సీజన్ 3ని హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే ఈ నాల్గవ సీజన్ హోస్ట్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయట. మరి బిగ్ బాస్ సీజన్ 4 ఎలాంటి సర్ ప్రయిజ్ లు ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: