సల్మాన్ ఖాన్ కు గర్ల్ ఫ్రెండ్ ను ముగ్గులోకి దించడం.. కండలు పెంచినంత ఈజీ. ఈ హీరో ఎంత ఈజీగా బ్రేకప్ చెప్పేస్తాడో.. అంతే ఈజీగా కొత్త లవ్ ను వెతుక్కుంటాడు. అయితే ప్యార్ లోనే కాదు.. మ్యాచ్ సెట్ చేయడంలోనూ ఎక్స్ పర్ట్ అనిపించుకుంటున్నాడు భాయిజాన్. లవర్స్ మధ్య బాండింగ్ పెంచడంలోనూ స్టార్ గా మారుతున్నాడు. 

 

సల్మాన్ ఖాన్ కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇమేజ్ ఉందో.. జనాల్లో అంతకుమించిన ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది భాయిజాన్ హెల్పింగ్ నేచర్ ఎక్కువని.. ఫ్రెండ్స్ ని చాలా అభిమానిస్తాడని చెబితే.. మరికొంతమంది మాత్రం ప్లే బాయ్ అనే మాటకు ఈ హీరో బ్రాండ్ అంబాసిడర్ అని కామెంట్ చేస్తారు. అలాగే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్లేబాయ్ మాత్రమే కాదు క్యూపిడ్ కూడా అని కామెంట్ చేస్తున్నారు. 

 

పుల్కిత్ సామ్రాట్, కృతికర్భంద రెండేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నారు. వీరే కె వెడ్డింగ్ టైమ్ లో లవ్ లో పడ్డ ఈ జంట లేట్ నైట్ పార్టీలు, డిన్నర్ డేట్స్ తో బాగానే గడిపారు. కాకపోతే ఇప్పుడు లాక్ డౌన్ తో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని తెగ బాధపడిపోతున్నారు. ఇక వీళ్ల బాధ తీర్చేందుకు సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగాడనే టాక్ వినిపిస్తోంది. 

 

సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ లో బుల్ బుల్ మ్యారేజ్ హాల్ అనే సినిమా రాబోతోంది. ఈ మూవీలో పుల్కిత్ సామ్రాట్, కృతికర్బందని లీడ్ పెయిర్ గా సెలక్ట్ అయ్యారనే టాక్ వస్తోంది. ఇక కెరీర్ పరంగా చాలా వెనుకబడిపోయిన వీళ్లను హీరో, హీరోయిన్లుగా సెలక్ట్ చేయడంతో పాటు విరహవేధనలో ఉన్న తమకు మంచి ఆఫర్ ఇచ్చాడని ఈ లవ్ బర్డ్స్ పండుగ చేసుకుంటున్నారట. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ ని బుల్ బుల్ సెట్స్ లో కవర్ చేసుకుందామని ఓట్లు కూడా వేసుకున్నారట. మరి సల్మాన్ సెట్ చేసిన ఈ మ్యాచ్ తో వీళ్ల లవ్ జర్నీ ఎటు వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: