హీరో అంటే ఇలానే ఉండాలి అన్న ఆలోచన నుండి హీరో ఇలా కూడా ఉండొచ్చు అనిపించేలా కొత్త సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలను ప్రోత్సహించే నటులు ఉండటం విశేషం. ఇక అలంటి వారిలో యువ హీరో శ్రీ విష్ణు ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చినా శ్రీవిష్ణు హీరోగా మారి సోలో సినిమాలు చేసే రేంజ్ కు వెళ్ళాడు. అయితే తను ఎంత ఎదిగినా సరే స్టార్ హీరో చెప్పిన మాటలని మర్చిపోనని చెప్పారు శ్రీవిష్ణు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో శ్రీవిష్ణు నటన చూసి ఫోన్ చేసి పిలిచారట అల్లు అర్జున్ 

 

అతని నటన గురించి అడిగి తెలుసుకున్నారట.. దాదాపు 30 నిమిషాల పాటు వారి మధ్య డిస్కషన్ నడిచిందట. రెగ్యులర్ సినిమాలు కాకుండా కథాబలం ఉన్న సినిమాలు చేయమని అల్లు అర్జున్ సలహా ఇచ్చారని.. ఆయన ఇచ్చిన సలహా ప్రకారమే తాను సినిమాలు చేస్తూ వచ్చానని చెప్పారు శ్రీవిష్ణు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు నీది నాది ఒకే కథ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ హీరో ప్రయత్నాలు చేయకుండా ప్రయోగాత్మక సినిమాలు చేయబట్టే తనని ఆడియెన్స్ ఆదరిస్తున్నారని అంటున్నాడు శ్రీవిష్ణు. తనకు ఇలాంటి సలహా ఇచ్చిన బన్నీకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని అన్నారు ఈ యువ హీరో. 

 

ప్రస్తుతం శ్రీవిష్ణు రాజ రాజ చోర సినిమాలో నటిస్తున్నాడు. సినిమా కథలే కాదు వాటికి తగినట్టు టైటిల్స్ కూడా చాలా కొత్తగా ట్రై చేస్తాడు శ్రీవిష్ణు. ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు కరెక్ట్ సినిమా పడాలే కానీ తన సత్తా చాటడం ఖాయమని చెప్పొచ్చు. ఎలాంటి సందేహం లేకుండా అతనితో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.       

మరింత సమాచారం తెలుసుకోండి: