యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కెరియర్ గురించి చెప్పాలంటే.. నూనూగు మీసాల వయసులోనే రికార్డులను సృష్టించిన చరిత్ర ఆయనది. అయితే తనకు వచ్చిన మాస్ ఇమేజ్ కు తగిన కథలను ఎంపిక చేసుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక దశలో ఏ కథ చేయాలి ఏ కథ చేయకూడదు అన్న డైలమాలో పడ్డాడు. అలాంటి టైంలోనే వరుసగా ప్లాప్ సినిమాలు పడ్డాయి. ఓ పక్క మిగతా స్టార్స్ 50 కోట్లు, 100 కోట్లు అంటూ గ్రాస్ లెక్కలు చెబుతుంటే తారక్ ఒక్కడే వెనుకపడిపోయాడు.. మనరోజంటూ ఒకటి వస్తే తప్పకుండా గెలుపు మనదే అవుతుంది అని పెద్దలు చెప్పినట్టుగా ఎన్టీఆర్ కూడా ఆ రోజు కోసం ఎదురుచూశాడు. 

 

అయితే అలాంటి సినిమానే పూరి రూపంలో వచ్చింది. టెంపర్ అంటూ ఓ కొత్త ఉత్సాహాన్ని తనలో నింపుకుని కొత్త ఎన్టీఆర్ ను మనకు పరిచయం చేశాడు. టెంపర్ సినిమా కథ వక్కంతం వంశీ రాశారు. ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆరాటపడ్డాడు వంశీ కానీ ఆ ఛాన్స్ పూరి అందుకున్నాడు. టెంపర్ కు ముందు వరుసగా ఐదారు ప్లాపులు అందుకున్న తారక్ ఆ సినిమాతో మళ్ళీ సరైన ట్రాక్ లోకి వచ్చాడు. సరైన సినిమా పడాలే కానీ ఎన్టీఆర్ స్టామినా ఇది అని ప్రూవ్ చేసేలా టెంపర్ తర్వాత సినిమా వసూళ్లు ఉన్నాయి.

 

టెంపర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పూర్తిగా మారింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత సినిమాలు చేశాడు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: