ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ కూడా కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడి ప్రజలను అక్కడే పూర్తిగా ఇళ్లలోనే ఉండేలా చేసి, వారి మధ్య సామజిక దూరం పెంచితేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలమని భావించిన ప్రభుత్వాలు కొన్నాళ్లుగా లాక్ డౌన్ అమలు చేస్తుండగా మన దేశంలో కూడా దాదాపుగా 41 రోజుల నుండి లాక్ డౌన్ ని కొనసాగిస్తోంది మన కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ వలన అన్ని రంగాలు కూడా పూర్తిగా మూతబడడంతో ఎందరో పేద, దిగువ తరగతి వర్గాల వారి ఆదాయం పూర్తిగా పడిపోయి తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతుండడంతో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్రీ రేషన్ తో పాటు కొంత నగదును కూడా పేద వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 

 

అలానే మేము సైతం అంటూ మరోవైపు పలు రంగాలకు చెందిన అనేకమంది తమ దయార్ద్ర హృదయంతో విరివిగా విరాళాలు ఇస్తుండగా సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అనేకమంది నటులు తమకు వీలైనంత మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తనకు వీలైనంతలో రూ.1.30 కోట్లు విరాళంగా ప్రకటించడం జరిగింది. అయితే అది మాత్రమే కాక తన టీమ్ తరపున మరికొంత విరాళంగా సేకరించి అన్నార్తులను గొప్ప మనసుతో ఆదుకుంటున్నారు విజయ్. కాగా గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ టీమ్ వారు కష్టపడి విరాళాలు సేకరించి ఆర్ధికంగా చితికిపోయిన వారికి భోజనంతో పాటు వీలైనంతలో నిత్యావరసరాలు కూడా అందించడం జరుగుతోంది. 

 

అయితే రెండు రోజుల క్రితం నుండి తన ఫౌండేషన్ పై అలానే తనపై కొంత వ్యతిరేకంగా ఒక ప్రముఖ వెబ్ సైట్ వారు తప్పుగా కథనాలు రాస్తున్నారని కాసేపటి క్రితం విజయ్ దేవరకొండ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసారు. విజయ్ ఫౌండేషన్ ఎంతమందికి విరాళాలు అందిస్తోంది, ఇప్పటివరకు ఎంతపోగయింది, వారు నిజంగానే విరాళాల సొమ్మును అన్నార్తులకు ఉపయోగిస్తున్నారా అంటూ సదరు వెబ్ సైట్ వారు తనపై కథనాలు రాయడం తనకు ఎంతో బాధేసిందని, అంతకన్నా కూడా తన ఇమేజ్, సినిమా కెరీర్ గురించి కొంత నెగటివ్ గా రాసినా తాను బాధపడేవాడిని కానని విజయ్ వీడియోతో పాటు ఒక ప్రెస్ నోట్ కూడా పోస్ట్ చేసారు. దయచేసి తమవంతుగా ఎందరి నుండో సేకరించిన విరాళాలు, మరెందరికో సాయం చేయాలనే తపనతో సాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని గురించి తప్పుగా రాయవద్దని విజయ్ కోరారు. కాగా ప్రస్తుతం విజయ్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: