స్టూడెంట్ నం.1 సినిమాతో దర్శకుడిగా మారిన ఎస్.ఎస్.రాజమౌళి మొదటి సినిమాతోనే సక్సస్ ని అందుకున్నారు. ఈ సినిమా తో జూ.ఎన్.టి.ఆర్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు రాజమౌళి. ఇక ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎన్.టి.ఆర్ కి తిరుగులేని మాస్ ఇమేజ్ ని తీసుకు వచ్చింది. దాదాపు 70 కథలని విన్న ఎన్.ట్.ఆర్ కి ఏది నచ్చకపోవడంతో వేరే హీరోకి అనుకున్న కథ ని ఎన్.టి.ఆర్ కి కేవలం 15 నిముషాలు మాత్రమే చెప్పారు రాజమౌళి. ఇక ఈ సినిమా రాజమౌళి కి స్టార్ డైరెక్టర్ గా చేరగని ముద్ర వేసింది.

 

ఇక ఈ సినిమాని వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్ లో వి దొరస్వామి రాజు సమర్పణలో తన తనయుడు నిర్మించారు. ఈ సినిమా కి కథ రాజమౌళి తండ్రి విజయోంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకి తండ్రే కథ అందిస్తున్నారు. మద్యలో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ తో వచ్చిన ఒక్క మర్యాద రామన్న తప్ప ఛత్రపతి, సై, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి ...ఇలా ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించిన సినిమాలన్ని తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో రూపొందినవే కావడం విశేషం.

 

తండ్రి రాసిన అద్భుతమైన కథ ని వెండితెరమీద అంతకంటే అద్భుతంగా తెరకెక్కించగలరు రాజమౌళి. మొదటి సినిమా నుండి బాహుబలి వరకు ప్రతీ సినిమా సూపర్ హిట్ అవడం గొప్ప విశేషం. ఈ రకంగా వరసగా సక్సస్ లను అందుకోవడం కేవలం ఒక్క రాజమౌళికే సాధ్యపడం గమనర్హం. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని రాజమౌళి కి బలం ఆయన తండ్రి..అని చెబుతుంటారు. అయితే ఇన్ని సక్సస్ లు అందుకున్న రాజమౌళి కథ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కారట. కథ తన తండ్రి రాసినదే అయినప్పటికి ఒక్క సీన్ నచ్చకపోయినా అసలు కాంప్రమైజ్ కారని చెబుతుంటారు. ఇదే విషయాన్ని ఇద్దరు ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: