కబాలి.. కాలా.. రోబో.. పేట..దర్బార్ ...ఇవన్ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు. కాని ఇవన్ని భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అయినా కూడా రజనీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంత భారీ సినిమాలు కోలీవుడ్ లో సూర్య, విజయ్, అజిత్ లు కూడా చేయడం లేదు. ఇక రజనీకాంత్ మాదిరిగా స్పీడ్ గా ఏ హీరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఈ వయసులో కూడా రజనీకాంత్ తన సత్తా చాటుతున్నారు. 

 

అయితే రజనీకాంత్ రీసెంట్ సినిమా దర్బార్ భారీగా నష్ఠాలను తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా నష్టపోయారు. అయినా రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయాడు. మాస్ చిత్రాల దర్శకుడు శివ తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ వరసగా అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. మాస్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించిన సినిమాలతో శివ వరసగా సక్సస్ లను అందుకుంటున్నాడు. దాంతో రజనీకాంత్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని శివకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరగాల్సింది ఉండగా... కాని కరోనా కారణంగా ఇంకా మొదలవలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూడా జాయిన్ అయ్యారు. అయితే సినిమాలు ఫ్లాపవుతూన్నా తన సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండేలా మాత్రం దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ ఏజ్ కి తగ్గట్టుగా ఖచ్చితంగా సీనియర్ హీరోయిన్ ఉండేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత సినిమాలలో కూడా రాధికా ఆప్టే, ధన్సిక, సిమ్రాన్, నయన తార, నివేదా థామస్ లాంటి వాళ్ళను నటింపజేశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు మేకర్స్. అయితే ఇది సూపర్ స్టామినా అంటూ కోలీవుడ్ లో తన అభిమానులు చెప్పుకుంటున్నారు.

 

ఇక ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా మొదలవబోతుంది. ఈ సినిమాతో పాటు చంద్రముఖి 2 కూడా మొదలవబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ కొరియో గ్రాఫర్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: