రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్, దీని అనంతరం మరొక్కమారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించబోయే భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పటినుంచో మిగతా హీరోల మాదిరిగా ఎన్టీఆర్ కూడా సొంతగా ఒక సినిమా నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా పలు వార్తలు రావడం జరిగింది. 

 

నిజానికి ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ మరోవైపు తన సోదరుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కొనసాగుతుండటంతో, తాను నెలకొల్పబోయే బ్యానర్ ని కూడా తన సోదరుడి బ్యానర్ మాదిరిగానే మంచి స్థాయిలో ఉంచేలా కొన్నాళ్లుగా పలువురు రచయితలు, దర్శకుల నుండి కథలు ఉంటున్నారట ఎన్టీఆర్. అయితే కొద్ది రోజుల క్రితం ఒక బడా దర్శకుడు చెప్పిన ఒక అద్భుతమైన స్టోరీ లైన్ విన్న ఎన్టీఆర్, ఈ కథ తనకెంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబు కి సరిపోతుందని చెప్పటం జరిగిందని, ఆ వెంటనే ఆ కథను విన్న మహేష్ బాబు కూడా తప్పకుండా సినిమా చేద్దాం ఈ లోపుగా అన్ని ప్లాన్ చేయండి అంటూ ఎన్టీఆర్ కు మాట ఇవ్వడం జరిగిందని అంటున్నారు. 

 

కాగా మహేష్ బాబు మాటతో ఎంతో సంతృప్తి చెందిన ఎన్టీఆర్, ఇప్పటికే తన బ్యానర్ పేరు లోగో విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు మొదలు పెట్టారని, ఇక అనంతరం ఆ బ్యానర్ ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మహేష్ బాబు తో చేయనున్న తొలి సినిమా అధికారిక ప్రకటన కూడా వెలువరించడం జరుగుతుందట. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు గానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు ఘట్టమనేని ఫ్యామిలీ తొలిసారిగా ఈ సినిమా ద్వారా కలవటం ఖాయమని తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: