చిరంజీవి కొరటాల మూవీ ‘ఆచార్య’ లో రామ్ చరణ్ నటించవలసిన ప్రత్యేక పాత్ర విషయంలో ఈమధ్యనే రాజమౌళి కొరటాల శివల మధ్య ఒక సమావేశం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వీరిద్దరూ ఒక చోట కలిసి ‘ఆచార్య’ లో రామ్ చరణ్ చేయవలసిన పాత్ర గురించి చాల వివరంగా చర్చించినట్లు తెలుస్తోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ చెప్పిన విషయాలు అన్నీ ఓపికగా విన్న రాజమౌళి చరణ్ ఆచార్య మూవీలో నటించడానికి లైన్ క్లియర్ చేసినప్పటికీ చాల ఖచ్చితమైన కండిషన్స్ పెట్టినట్లు టాక్. కొరటాల కోరినవిధంగా తాను రామ్ చరణ్ కు సంబంధించిన డేట్స్ 30 రోజులు ఇవ్వలేనని కావాలి అంటే 15 రోజుల డేట్స్ ‘ఆచార్య’ కు ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదు అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 


‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి అలియా భట్ చరణ్ లపై తీయవలసిన సీన్స్ ఇంకా చాల ఉన్నాయని ప్రస్తుతం అలియా భట్ చాల బిజీగా ఉన్న నేపధ్యంలో ఆమె డేట్స్ ను బట్టి చరణ్ డేట్స్ ను సర్దుబాటు చేయాలని దీనితో చరణ్ ఏకంగా 30 రోజులు  ‘ఆచార్య’లో చిక్కుకుంటే తాను ‘ఆచార్య’ ను పూర్తి చేయడం అసాధ్యం అంటూ రాజమౌళి చరణ్ విషయమై తన మనసులో మాట చాల సున్నితంగా స్పష్టంగా కొరటాలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ‘ఆచార్య’ లో అత్యంత కీలకంగా మారిన చరణ్ పాత్రను ఎలా కుదించి జక్కన్న కోరిన విధంగా 15 రోజులలో ఎలా షూటింగ్ పూర్తి చేయాలో తెలియక కొరటాల శివ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉండగా సినిమా షూటింగ్ లకు సంబందించిన విషయాల పై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు వచ్చే నెల నుండి తెలంగాణ ప్రభుత్వం తొలిగిస్తుంది అని వార్తలు వస్తున్న పరిస్థితులలో అన్నీ అనుకూలిస్తే జూలై నెల నుండి ‘ఆచార్య’ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఖచ్చితంగా మూడు నెలలలో పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ లో కొరటాల ఉన్నట్లు టాక్. దీనితో ఈ మూవీ విడుదల ఈ సంవత్సరం అసాధ్యం అనీ ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడితే ‘ఆర్ ఆర్ ఆర్’ రిజర్వ్ చేసుకున్న జనవరి 8న ‘ఆచార్య’ ను విడుదల చేసి సంక్రాంతి రేసులో నిలబెట్టాలని స్పష్టమైన ఆలోచనలలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: