ప్రస్థుతం చూడడానికి ధియేటర్లలో సినిమాలు లేకపోవడంతే సినిమా అభిమానులు అంతా అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఒటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో కనిపిస్తున్న సినిమాలను ఒకటికి రెండు సార్లు చూస్తూ కొత్త సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుండి లాక్ డౌన్ కారణంగా అందరు ఇళ్ళకే పరిమితం అవ్వడంతో సెలెబ్రెటీలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలను కూడ తెగ ఫాలో అవుతున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో క్రేజీ హీరోయిన్ రష్మిక తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో చేసిన లైవ్ ఛాట్ కార్యక్రమంలో రష్మిక వ్యవహరించిన తీరు విజయ్ దేవరకొండ అభిమానులకు అసహనాన్ని కలిగించడమే కాకుండా ఆమె ప్రవర్తన విజయ్ దేవరకొండను అవమానపరిచే విధంగా ఉంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లైవ్ ఛాట్ లో రష్మిక తన అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా ఒక అభిమాని కోరిక మేరకు రష్మిక తన ఇంటిలోని ప్రతి గదిని తన అభిమానులకు చూపెట్టి తన అభిమానులకు జోస్జ్ ను కలిగించింది.


అయితే రష్మిక తన బెడ్ రూమ్ ను మాత్రం చూపించకుండా మిగతా ఇల్లు అంతా తన అభిమానులకు చూపించి తెలివిగా వ్యవహరించింది. ఈ ఛాట్ లో ఒక అభిమాని  రష్మికను ప్రశ్నిస్తూ విజయ్ దేవరకొండ నితిన్ ల మధ్య ఎవరు తనకు బాగా ఇష్టం అంటూ అనేకసార్లు ప్రశ్నించాడు. అయితే ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మిగతా అభిమానుల ప్రశ్నలకు చిలిపిగా సమాధానం ఇచ్చింది. మరొక అభిమాని ఆమెతో విజయ్ దేవరకొండ తో మళ్ళీ ఎప్పడు నటిస్తావు అని అడిగినా ఆ ప్రశ్నకు కూడ రష్మిక పట్టించుకోలేదు.  


అంతేకాదు తాను సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పక్కన నటించే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. దీనితో విజయ్ అభిమానులు రష్మిక పై మండిపడిపోతున్నారు. ‘డియర్ కామ్రేడ్ విడుదల సమయంలో అనేకమంది రష్మిక విజయ్ దేవరకొండల సాన్నిహిత్యం పై అనేక నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఓపెన్ గా రష్మికను ఆడుకున్న విజయ్ దేవరకొండ చేసిన సహాయాన్ని మరిచిపోయి కనీసం తమ హీరో పేరు ప్రస్తావించదానికి కూడ రష్మిక కు అవకాశం చిక్కలేదా అంటూ ఆమె తీరు పై ప్రస్తుతం విజయ్ అభిమానులు మండిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: