పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా సరే ఆయనకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గదు. ఆయన కెరీర్ లో విజయం సాధించిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆ విధంగా ఆయన కెరీర్ లో సినిమాలుఏ ఒక్కటి కూడా చెప్పుకోదగిన హిట్ సాధించలేదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆయన కెరీర్ లో అదిరిపోయే విజయాన్ని కూడా అందించాయి అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా అత్తారింటికి దారేది. మాటల మంత్రి కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అప్పుడు. 

 

సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ స్టార్ హీరో హోదాను మళ్ళీ నిలబెట్టుకున్నారు. జల్సా సినిమా తర్వాత ఆయన చేసి విజయం సాధించిన సినిమా ఇది  ఒక్కటే కావడం విశేషం. ఆ సినిమా తర్వాత పవన్ ఇప్పటి వరకు మంచి హిట్ అనేది సాధించలేదు అనేది వాస్తవం. ఆ స్థాయిలో హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి ఆయన సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సినిమాల మీద మళ్ళీ దృష్టి పెట్టి వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తనను తాను చాలా మార్చుకున్నారు అని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ భారీగా బరువు కూడా తగ్గాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది మొదట్లో మొదలు పెట్టి వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ హరీష్ శంకర్ తో ఒక సినిమా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: