యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ స్టార్. బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో చాలా మంఇ అభిమానులు ఉన్నారు. సాహో సినిమా దక్షిణాది ప్రేక్షకులని అలరించలేకపోయినా ఉత్తరాది వారిని బాగానే ఆకట్టుకుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలని మిగిల్చిన ఈ సినిమా అక్కడి వారికి లాభాలని పంచిపెట్టింది. ఈ ఒక్క ఉదాహరణతో ఉత్తరాదిన ప్రభాస్ మేనియా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

 

అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీ అని ఇంతకుముందే చెప్పారు. యూరప్ లో జరిగే ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. బాహుబలి, సాహో వంటి విభిన్న సినిమాల ద్వారా మనల్ని పలకరించిన ప్రభాస్ ఈ సారి లవ్ స్టోరీతో రాబోతున్నాడు. అయితే లవ్ స్టోరీ చిత్రాలకి మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది.

 


అందుకే సేఫ్ సైడ్ గా ఈ కథని ఎంచుకున్నాడని అంటారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ షూటింగులకి ఎప్పుడు అనుమతులు ఇస్తారో తెలియదు. అనుమతులు ఇచ్చినా ఇతర దేశాలకి వెళ్లడం కష్టం. అటువంటి నేపథ్యంలో ఇతర దేశాల లొకేషన్స్ ని ఇక్కడే సెట్ వేసి చిత్రీకరణని కొనసాగిస్తారట. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ ఆల్రెడీ స్కెచెస్ రెడీ చేశాడని సమాచారం.

 

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే రోల్ గురించి ఒకానొక వార్త బయటకి వచ్చింది. పూజాహెగ్డే ఈ సినిమాలో టీచర్ గా కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. ౧౯౭౦ ప్రాంతంలో టీచర్ లు ఏ విధంగ ఉండేవారో అలాంటి లుక్ చాలా అందంగా కనిపించనుందని చెబుతున్నారు. మరి టీచర్ తో ప్రేమలో పడే ప్రభాస్ రోల్ ఎలా ఉండనుందో అని ఆసక్తి మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: