లాక్ డౌన్ మళ్ళీ దేశవ్యాప్తంగా పొడిగించి న పరిస్థితులలో తెలంగాణా రాష్ట్రంలో కూడ లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించే నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నారు. దీనితో జూనియర్ ఎన్టీఆర్  పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ రావడం ఇప్పుడు అసాధ్యంగా మారింది.
 

అయినా  తారక్ పుట్టినరోజునాడు అతడి అభిమానులకు ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి ఎదో ఒక బహుమతి ఉండేలా ప్రయత్నించాలని రాజమౌళి మారిన పరిస్థితుల మధ్య తన ఆలోచనలు కూడ మార్చుకుంటున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు లాక్ డౌన్ ప్రకటన రాకమముందు వరకు తయారు అయినటువంటి జూనియర్ కొమరం భీమ్ కాన్సెప్ట్ టీజర్ కు రిపేర్లు చేసి అతి చిన్న వీడియో అయినా విడుదల చేయగలమా అన్న ఆలోచనలలో రాజమౌళి ఉన్నట్లు టాక్. 


అది కుదరకపోతే టోటల్ గా టీజర్ ఆలోచనను పక్కనపెట్టి మరో రకంగా ఒక మోషన్ పోష్టర్ ను అయినా జూనియర్ పాత్రకు సంబంధించి వెరైటీగా డిజైన్ చేసి విడుదల చేస్తే బాగుంటుందని జక్కన్న తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రత్యేక వీడియోలో కానీ లేదంటే మోషన్ పోష్టర్ లో కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఉండబోయే ట్విస్ట్ కు సంబంధించిన హింట్ ఇస్తూ రాబోతున్న మే 20వ తారీఖును ఒక ట్రేండింగ్ డేగా మార్చాలని రాజమౌళి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్నాయి. 


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ కథలో జూనియర్ చరణ్ పాత్రలకు సంబంధించిన సమతుల్యంలో చిన్న తేడాలు ఉన్నట్లు రాజమౌళి గ్రహించడంతో జూనియర్ చరణ్ పాత్రల డిజైనింగ్ విషయంలో మరింత సమతుల్యం పాటించడానికి ప్రస్తుతం రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూడ ఈ సినిమాకు సంబంధించిన కథలోని ట్విస్ట్ లపై మరింత లోతుగా చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనితో జూనియర్ పుట్టినరోజునాడు ఎదో ఒక మ్యాజిక్ చేసి రాజమౌళి గట్టెక్కుతాడు అన్న భావన పెరుగుతోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: