బాలయ్యకు.. ఎన్ని హిట్స్ వచ్చిన సరే.. ఈ సూపర్ హిట్ లేకుండా అయన కెరీర్ మరో రకంగా ఉండేది.. అలాంటిది ఆయనకు ఓ మంచి సూపర్ హిట్ అందించిన సినిమా ఇది. ఇంకా అలాంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు ఎవరు అనుకున్నారు? బోయపాటి శ్రీను. ఈయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఎమోషన్స్.. ఫైట్స్.. ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. ప్రేమ.. ఏడుపులు.. చంపుకోడాలు అన్ని ఉంటాయి..హేయ్ ఇంకొకటి ఉంది.. అదే డైలాగ్స్. అదిరిపోయే డైలాగులు ఉంటాయి.. నిజం చెప్పాలి అంటే మాస్ ఆడియన్స్ ఆ డైలాగులకే పడిపోతారు.. ఇంకా అన్ని ఉన్న సినిమా ఎంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 

 

ఇంకా ఈ సినిమా వచ్చి కచ్చితంగా 11 ఏళ్ళు అవుతుంది.. ఈ సినిమా చుసి బాలయ్య ఫాన్స్  పిచ్చోళ్ళు అయిపోయారు అంటే నమ్మండి.. ఇంకా ఆ సినిమా ఊర మాస్ డైలాగులు.. బోయపాటి మార్క్ తెచ్చిపెట్టాయ్.. ఆ సినిమా చుసిన ప్రతిఒక్కరు రెండు మూడు సార్లు థియేటర్ వైపు వెళ్లారు.. విజిల్స్.. అరుపులతో రచ్చ రచ్చ చేసారు అంటే నమ్మండి. 

 

ఇంకా ఈ సినిమా కేవలం బాలయ్య ఫాన్స్ కే కాదు.. మాములు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా లో డైలాగ్స్ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. అంత అద్భుతంగా ఉన్నాయి డైలాగ్స్.. ఇంకా అన్నింటిలోకి ఒక డైలాగ్ మాత్రం సూపర్ హిట్టు అంతే.. ఆ డైలాగ్ ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి.. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలి అనుకోకు…తట్టుకోలేవు, మాడిపోతావ్.. ఇంకా ఈ డైలాగ్ వచ్చినప్పటి నుండి ప్రతోడు వైపులా గురించి మాట్లాడేవాడే.. అలా ఉంటాయి డైలాగ్స్..                        

మరింత సమాచారం తెలుసుకోండి: