రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనని టార్గెట్ చేస్తున్న వెబ్ సైట్స్ మీద ఫైర్ అయ్యాడు. తన మీద తప్పుడు వార్తలు రాస్తున్న ఆ వెబ్ సైట్ అసలు రంగు ఇదంటూ విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆ వెబ్ సైట్ తన మీద రాసిన తప్పుడు వార్తలకు తన రియాక్షన్ వీడియో రూపంలో బయటపెట్టాడు. తనని ఆ వెబ్ సైట్ ఇంటర్వ్యూ అడిగారని అది కుదరదని చెప్పేసరికి ఇలా తనని టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారని అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను, ఫేక్ సైట్లను ఎంకరేజ్ చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ కేవలం 7500 మందికి మాత్రమే నిత్యవసరాలు అందించిందని. అతను కేవలం 2000 మందికే నిత్యావసరాలు అందించాలని అనుకున్నాడని మిగతా 5000 మందికి తన ఫ్యాన్స్ ద్వారా సరుకులు అందించారని ఆ వెబ్ సైట్ లో రాసుకొచ్చారు. అక్కడ కేవలం 7500 మంది మాత్రమే మీకు కనిపిస్తున్నారు.. కానీ అక్కడ లబ్ది పొందింది 7500 ఫ్యామిలీస్ అని చెప్పాడు విజయ్ దేవరకొండ. గాసిప్ వెబ్ సైట్స్ పై విజయ్ దేవరకొండ రెస్పాండ్ అయినా విధానాన్ని మెచ్చుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 

 

విజయ్ దేవరకొండకు నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే చాల లేట్ అయ్యింది.. పరిశ్రమ దీనిపై స్పందించడంలో వెనుకపడ్డది. ఇలాంటివాళ్ళు ఇండస్ట్రీని జలగల్లా పట్టి రక్తం తాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. నీ యాక్షన్ కు ధన్యవాదాలు.. యాక్షన్ కు టైం పడుతుంది మై బోయ్ అంటూ విజయ్ దేవరకొండకు తన సపోర్ట్ ఇచ్చారు నాగబాబు. ఇక విజయ్ దేవరకొండ వీడియోకి సూపర్ స్టార్ మహేష్ సపోర్ట్ కూడా అందింది. నేను నీకు అండగా నిలుస్తానంటూ మహేష్ కూడా ట్వీట్ చేశారు. కొరటాల శివ, అనీల్ రావిపూడి కూడా విజయ్ దేవరకొండకు సపోర్ట్ గా నిలిచారు. విజయ్ దేవరకొండ యాక్షన్ కు స్టార్స్ రియాక్షన్ అదిరిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: