టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడైన అక్కినేని నాగార్జున విక్రమ్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ సినిమాల్లో నటించాడు కానీ అవి ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. విషాదకర కథా నేపథ్యంలో తెరకెక్కిన మజ్ను సినిమాలో హీరోగా నటించిన నాగార్జునకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విడుదలైన సంకీర్తన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తన తండ్రితో కలిసి కలెక్టర్ గారి అబ్బాయి సినిమా లో నాగార్జున మొట్టమొదటిగా నటించాడు.


సినిమా తరువాత అతడు నటించిన రెండు సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. ఆ క్రమంలోనే నాగార్జున శ్రీదేవితో కలిసి ఆఖరిపోరాటం అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ చిత్రంలో సుహాసిని అల్లురామలింగయ్య, కైకాల సత్యనారాయణ, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రమే నాగార్జున కెరీర్ లో మొట్టమొదటిగా విజయవంతం అయ్యింది. ఆ తర్వాత వరుసగా ఐదు సినిమాలు తీసిన నాగార్జునకి తీవ్ర నిరాశే మిగిలింది.


1989లో తమిళ దర్శకుడు మణిరత్నం స్ట్రెయిట్ తెలుగు సినిమా అయిన గీతాంజలి ని నాగార్జునతో కలిసి తెరకెక్కించాడు. మంచి ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నాగార్జున కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. గీతాంజలి సినిమా అతన్ని ఒక రొమాంటిక్ హీరోగా నిలబెట్టింది. అదే సంవత్సరంలో తెలుగులో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమాలో అక్కినేని నాగార్జున హీరోగా నటించాడు. ఈ చిత్రంలో నాగార్జున సరసన తన ప్రస్తుత భార్య అయిన అమల నటించడం విశేషం.


వాస్తవానికి ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో భారీ హిట్ గా నిలిచి నాగార్జునని బడా స్టార్ హీరోని చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలకే సాటిగా నిలిచేందుకు శివ సినిమా నాగార్జునకు ఎంతో దోహద పడింది. ఆయన కెరియర్ లో అన్ని సినిమాలు ఒకెత్తయితే... శివ సినిమా మరో ఎత్తు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: