తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ ని సంపాదించిన విజయ్ దేవరకొండ కూడా మొదట్లో ఎంతో కష్టపడ్డాడు. వాస్తవానికి విజయ్ తల్లిదండ్రులు తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని అచ్చంపేట గ్రామంలో నివసించే వారు. తన తండ్రి గోవర్ధనరావు కు సినిమాలు అంటే చచ్చేంత ఇష్టం. నటనపై కూడా తనకి చాలా మక్కువ ఉండేది. అందుకే పెళ్లి అయిన వెంటనే హైదరాబాదు నగరానికి మకాం మార్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ తనకు మాత్రం ఏ చిత్రంలో అవకాశాలు రాలేదు. దాంతో తాను దూరదర్శన్ శాఖలో చేసి చాలా సీరియళ్లకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.


అయితే తండ్రి ఎలాగో నటుడు కాలేక పోయాడని... విజయ్ దేవరకొండ తన తండ్రి ఆశయాన్ని తన ద్వారా తీర్చాలని అనుకున్నాడు. సూత్రధార్ నాటక సమాజంలో మూడు నెలలపాటు వర్క్ షాప్ లో పాల్గొని హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్లో ఎన్నో నాటకాలలో విజయ్ నటించాడు. అప్పుడు కాస్త ధైర్యం తో సినిమా వైపు అడుగులు తీశాడు. ఆ క్రమంలోనే రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో ఓ చిన్న పాత్ర దొరకడంతో అందులో నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్రలో విజయ్ నటించాడు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండ కు బాగా పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతోనే నాగ్ అశ్విన్ తాను చేస్తున్న ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో సైడ్ హీరో పాత్రని విజయ్ దేవరకొండ కి ఇవ్వగా... ఆ పాత్రలో విజయ్ సూపర్ గా నటించి అందరి ప్రశంసలను అందుకున్నాడు.


ఆ విధంగా సరికొత్త కథ నేపథ్యంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాలో కథానాయకుడిగా ఆఫర్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ తన నటనతో అందర్నీ తెగ మెప్పించేశాడు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో గొప్ప హిట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వలన అతనికి అర్జున్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం లభించింది అని అతను అనేక సందర్భంగా తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: