లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీ వేదికలపై సినిమాలు చూడడం బాగా పెరిగింది. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు చూస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. లాక్డౌన్ మొదటి ఫేజ్ లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకి సబ్ స్కైబర్స్ బాగా పెరిగారు కూడా. దాంతో థియేటర్లలో సినిమా చూసే అలవాటు తగ్గిపోనుందని, ఇకపై ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే సినిమాలు చూసే అలవాటు పెరగనుందని అన్నారు.

 

అంతే కాదు ఇప్పుడు రిలీజ్ కి ఉన్న సినిమాలని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చాలామంది భావించారు. చాలా సినిమాలు డైరెక్టుగా రిలీజ్ కూడా చేశారు. తెలుగులో అమృతరామమ్ ఓటీటీ వేదికగా విడుదల అయిన మొదటి చిత్రం. అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మిగతా సినిమాలని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చిన్న నిర్మాతలు ఆర్థికంగా మరింతగా నష్టపోకుండా ఉండడానికి ఓటీటీకి అమ్మేయడానికి చూస్తున్నారు.

 


అయితే ప్రస్తుతం ఓటీటీలో సినిమా చూడడం చాలా మందికి బోర్ కొట్టిందట. ఓటీటీ వేదికగా సినిమాలు చూడడం ఎక్కువగా మొబైల్స్ లోనే జరుగుతుంది. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ టీవీలు లేవు కాబట్టి మొబైల్స్ లోనే ఎక్కువగా చూస్తున్నారు. దీనివల్ల సినిమా చూస్తున్న ఫీలింగ్ ని కోల్పోతున్నారు. ఏదో కొన్ని రోజులు బాగానే ఉందిగానీ, థియేటర్ అనుభవాన్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ చాలా మందిలో కలుగుతుంది.

 


అందువల్ల ఓటీటీ అనేది కొన్ని ప్రత్యేకమైన వెబ్ సిరీస్ లని, సినిమాలని చూడడానికే బాగుంటుందని అంటున్నారు. థియేటర్లో సినిమా చూసే అనుభవాన్ని ఏ వేదికా సబ్ స్టిట్యూట్ చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నిబట్టి ఎన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చినా థియేటర్ కి ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు. గుంపుగా సినిమా చూడడం, ఈలలు వేయడం, గోల చేయడం, అందరి మధ్యలో హాస్యాన్ని ఆస్వాదించడం థియేటర్లోనే సాధ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: