ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం ఆర్.ఆర్‌.ఆర్‌. హై బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది. ఆర్.ఆర్.ఆర్ పై వస్తున్న రోజుకొక వార్త అటు ఎన్టీఆర్ మరియు ఇటుచరణ్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. ఈ ఏడాది జులై లో విడుదల కలవాల్సిన ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరికి షిఫ్ట్ చేశారు. ఐతే ఈ మూవీ జనవరి నుండి సమ్మర్ కి వాయిదా పడుతుందని కొన్ని వార్తలు వస్తుండగా… కొందరు ఏకంగా 2021 జులై కి ఆర్.ఆర్.ఆర్ విడుదల వాయిదాపడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నుండి ఆర్.ఆర్.ఆర్ కంటే ముందు త్రివిక్రమ్ మూవీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 

ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రకటించగా అది లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళుతుంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని 10నెలల లోపే చుట్టేయడం ఖాయం. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ విడుదల జులై కి వాయిదా పడితే త్రివిక్రమ్ మూవీ ముందే విడుదల కావచ్చు.  అంటే ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ మూవీనే ముందు ఫ్యాన్స్ ముందుకు వ‌చ్చేలా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆయన్ని వెండి తెరపై చూసి ఏడాదిన్నర అవుతుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలలో ఏది విడుదల అయినా పండగ చేసుకోవడం ఖాయం.

 

కాక‌పోతే ఆర్‌.ఆర్‌.ఆర్ పై ఎక్కువ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌తో ఉన్నారు కాబ‌ట్టి ఈ చిత్రం కోసం కాస్త ఎక్కువ‌గా ఎదురు చూస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఇంత గ్యాప్ రావ‌ల‌సివచ్చింది. లేదంటే ఇంత గ్యాప్ ఉండేది కాదు. మ‌రి క‌రోనా అయ్యాక‌యినా రాజ‌మౌళి సినిమాని కాస్త వేగ‌వంతం చేస్తారో లేదో చూడాలి. అలాగే చ‌ర‌ణ్ కూడా ఈ సినిమా అయిపోతే ఆయ‌న కూడా మ‌రో ప్రాజక్ట్‌లోకి వెళ్ళిపోవాల‌ని వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న కావ‌డంతో రాజ‌మౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఏమ‌న్నా స‌ర్‌ప్రైజ్ ఇస్తారో లేదో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: