హీరో రామ్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. దేవదాసు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోగా అడుగుపెట్టిన ఈయ‌న‌.. మొద‌టి సినిమాతోనే బాక్సాఫిస్ వ‌ద్ద భారీ హిట్ కొట్టాడు. ఇక హై వోల్టేజ్ ఎనర్జీతో కనిపించే అతికొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. కెరీర్ లో విజయాల కంటే అపజయలే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్ష‌కుల్లో ఈయ‌న‌ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఇటీవ‌ల రామ్ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న తరుణంలో చేసిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ కేవలం క్లాస్ సినిమాలే చేస్తాడని వచ్చిన కామెంట్స్ కి ఇస్మార్ట్ శంకర్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడీయ‌న‌.

 

ఈ సినిమాతో కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న రామ్ వ‌సూళ్ల ప‌రంగా కూడా కెరీర్ బెస్ట్ విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్మకత్వం వహించగా.. ఒకప్పటి హీరోయిన్ ఛార్మీ నిర్మాతగా వ్యవహరించింది. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్‌ని చిందులు వేయించిన చిత్ర‌మిది. మ‌రియు చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్‌ అందుకున్న సినిమా ఇది. 

 

అంతేకాదు, ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత  సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. నిజానికి చెప్పాలంటే.. రామ్ కెరీర్ అయిపోతోంది అనుకుంటున్న టైమ్‌లో.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ఆయ‌న క్రేజ్‌ను ప‌దింత‌లు చేసింది.  ఇక రామ్ కు కెరీర్ ప్రారంభంలో దేవదాసు వంటి మాస్ సినిమాలు పడ్డాయి కానీ ఆ తర్వాత రెడీ వంటి కామెడీలు, నేను శైలజా వంటి కూల్ లవ్ స్టోరీ లు వచ్చాయి. 

 

అయితే ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా మాత్రం అతనికి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెడుతుంది. ఇక ఇదే జోరుతో ప్ర‌స్తుతం ‘రెడ్’ అనే మాసివ్ చిత్రంలో   చేస్తున్నాడు రామ్. నేను శైలజ లాంటి బ్లాక్ బస్టర్ ని కెరీర్ కి అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. స్రవంతి మూవీస్ పతాకంపై పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారు. అయితే అనుకోకుండా లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లో ఖాళీగా టైమ్ పాస్ చేస్తోన్న రామ్.. తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట. 

 

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: