ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మొదటి యువ హీరో అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ మామకు తగ్గ అల్లుడుగా.. తాతకు తగ్గ మనవడిగా... తండ్రికి తగ్గ తనయుడిగా నిలదొక్కుకొని స్టార్ హీరోగా దూసుకుపోతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో  తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్... మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో కెరీర్ కు మంచి బాటలు  పడ్డాయి. 

 

 

 అయితే గంగోత్రి సినిమా మంచి విజయం సాధించినప్పటికీ అల్లు అర్జున్ ని ఒక్కసారిగా స్టార్ హీరో ని మాత్రం చేయలేక పోయింది. మరి అల్లు అర్జున్ స్టార్ హీరోగా  చేసిన సినిమా ఏది అంటే బన్నీ సినిమా. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన  బన్నీ సినిమాలో  అల్లు అర్జున్ ని సరి కొత్తగా చూపించడంలో విజయం సాధించాడు v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ . ఇక ఈ సినిమాలో కాలేజీ కుర్రాడు గా నటించిన బన్నీ తనదైన కామెడీ టైమింగ్ తో... అదిరిపోయే యాక్షన్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు  అని చెప్పాలి. అటు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

 

 అయితే వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ సినిమా బన్నీ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పాలి. అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉన్న అల్లు అర్జున్ ని స్టార్ హీరో గా మార్చేసింది. ఇక అల్లు అర్జున్ పేరు కాస్త బన్నీ గా మారిపోయింది. ఇప్పటికే అల్లు అర్జున్ ను  చాలామంది బన్నీ అనే పిలుస్తుంటారు. ఇక బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కేవలం తన  యాక్షన్  కామెడీతోనే కాదు తన డాన్సులతో ఇరగదీశాడు అనే చెప్పాలి. దీంతో ప్రేక్షకులందరూ అల్లు అర్జున్ టాలెంట్ కి  ఫిదా అయిపోయారు. దీంతో అభిమానులు కూడా అల్లు అర్జున్ ను బన్నీ  అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా బన్నీ  అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: