ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతూ యూత్ అందరికీ క్రేజీ హీరోగా ఒక ఇన్స్పిరేషన్ గా యూత్ ఐకాన్ గా మారిపోయిన హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కెరియర్ అమాంతం ఆసక్తికరంగా ముందుకు సాగింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో పైకి వచ్చిన వాడు అని చెప్పాలి. కేవలం తన సినిమాలతో నే కాదు తన ఆటిట్యూడ్తో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీ కి రావడానికి ఎన్నో కష్టాలు పడిన విజయ్ దేవరకొండ... మొదట నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ పాత్రలో నటించాడు. 

 

 

 హీరో ఫ్రెండ్ పాత్ర చేసినప్పటికీ హీరో కి మించిన క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. దర్శక నిర్మాతలను ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లిచూపులు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమా అయితే విజయం సాధించింది కానీ విజయ్ దేవరకొండకు మాత్రం స్టార్ హీరో రేంజ్ మాత్రం రాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్  కాస్త మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. 

 

 

 ఆ సినిమానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా.బోల్డ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ని మలుపు తిప్పి స్టార్ హీరో గా మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది  అనే చెప్పాలి. యూత్ ని మొత్తం ఆకర్షించిన ఈ సినిమా... యూత్ లో విజయ్ దేవరకొండ కు ఫాలోయింగ్ ని ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా వరుస బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోయి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: