రానా ద‌గ్గుబాటి ఈ పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. లీడ‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో. ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు కొడుకు. టాలీవుడ్ టాప్ హీరో వెంక‌టేష్ అన్న కొడుకు రానా ద‌గ్గుబాటి. రానా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌న్నీ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఆయ‌న ఎంచుకునే క‌థ‌లు ఒకొక్క‌టి ఒక్కో విధంగా డిఫ‌రెంట్‌గా ఉండే క‌థ‌ల‌నే ఎక్కువ‌గా ఎన్నుకుంటూ ఉంటారు. ఇక ఆయ‌న న‌టించిన చిత్రాల‌న్నిటిలోక‌ల్లా బాహుబ‌లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన భ‌ల్లాళ దేవుడిగా న‌టించిన ఆ పాత్ర‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఆ చిత్రంలో రానా విల‌న్‌గా చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న గ‌త చిత్రాల్లో దేనికి రానంత క్రేజ్ ఆ చిత్రానికి వ‌చ్చింది. నేనే రాజు నేనేమంత్రి, ఘాజీ, రుద్ర‌మ‌దేవి ఇలా ఇన్ని డిఫ‌రెంట్ చిత్రాల్లో న‌టించినా రాని క్రేజ్ ప్ర‌భాస్‌కి ఆపోజిట్ పాత్ర‌లో విల‌న్ క్యారెక్ట‌ర్‌లో రానా అద‌ర‌గొట్టాడ‌ని చెప్పాలి. 

 

ఇక‌ ఈ సినిమా తర్వాత రానాసినిమా చేసిన సరే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు రానా. ఒక దశలో రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, విదేశాల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ జరుగిందన్న ప్రచారం జరిగింది. తాజాగా రానా సినిమాలపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది.

 

రానా తానే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించాలని భావించిన హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రానా లుక్‌తో పాటు లాంగ్ గ్యాప్‌తో రానా మార్కెట్‌ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన సినిమాల విషయంలో కూడా రానా పునరాలోచనలో ఉన్నాడ‌ట‌. ఇక హాథీమీరా సాథీ, అర‌ణ్య లాంటి చిత్రాల‌న్నీ కూడా క‌రోనా కార‌ణంగా పెండింగ్ లో ప‌డింది మ‌రి లాక్‌డౌన్ పూర్త‌వ‌గానే ఈ సినిమాల‌న్నీ సెట్స్ మీద‌కు వెళ్ళ‌నున్నాయ‌ని స‌మాచారం. అప్ప‌టివ‌ర‌కు రానా టీవీ షోల‌తో కాలంగ‌డిపే ప‌నిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: