టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ ఎవరంటే వెంటనే కైకాల సత్యనారాయణ, నాగభూషనం అంటారు. ఆ తర్వాత రావుగోపాలరావు, నూతన ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు ఇలా తమ విలనీజంతో ఆకట్టుకున్నారు.  అయితే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ప్రతినాయకుడిగా ఢీ అంటే ఢీ అన్నట్లు నటించారు నాగభూషనం.  ఆయనను సినీ పరిశ్రమలో రక్తకన్నీరు నాగభూషనం అంటారు. చక్రవర్తుల నాగభూషణం  ఏప్రిల్ 19, 1921  జన్మిందచి మే 5, 1995 కన్నుమూశారు. మొదట రంగస్థలంపై తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఎన్నో వేల నాటకాలు వేశారు. ఒక్క ‘రక్తకన్నీరు’ నాటకాన్నే ఆయన దాదాపు రెండువేల ప్రదర్శనలు ఇచ్చారు. అందుకే ఇయన సినీ పరిశ్రమలో రక్తకన్నీరు నాగభూషనం అంటారు.   తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక సినిమాల్లో  విలక్షణ  ప్రతినాయకుడిగా గుర్తింపు  తెచ్చుకున్నారు.

 

 అప్పట్లో అటు సినిమాల్లోనూ, రంగస్థలం మీదా ఏకకాలంలో ‘బిజీస్టార్‌’ అనిపించుకున్న ఏకైక నటుడు నాగభూషనం ఒక్కరే. బిజీస్టార్‌ కాకముందు ఒకే నెలలో ముప్పయ్‌ ప్రదర్శనలు, ఒకేరాత్రిలో రెండు ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనతా నాగభూషణం సాధించారు.  ప్రముఖ నటీమణులు వాణీశ్రీ, శారద మొదట్లో ఆయన నాటక బృందంలో వుండేవారు. పీపుల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు (1952) సినిమాలో నాగభూషణం చిన్నపాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పెంకి పెళ్లాం (1956)లో వేసిన తాగుబోతు వేషం, అమరసందేశం (1954)లో వేసిన విలన్ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చాయి.

 

నాగభూషనం మేనరీజం చాలా విచిత్రంగా ఉండేది.. ఆయన డైలాగ్ డెలవరి చాలా విచిత్రంగా ఉండేది. అదే స్టైల్ చాలా మంది విలన్లు ఫాలో అయ్యారని అంటుంటారు.  నాగ భూషనం ప్రభావం రావుగోపాలరావుపై చాలా ఉందని.. ఆయన విలనీజాన్ని ఫాలో అయ్యేవారని అప్పట్లో అనేవారు.  పౌరాణిక పాత్రల్లో శివుడు (భూకైలాస్), సాత్యకి , మాయాబజార్ (1957) లో సహాయక పాత్ర, పౌండ్రక వాసుదేవుడు (శ్రీకృష్ణవిజయం), శకుని (కురుక్షేత్రం) మొదలైన పాత్రలు ధరించారు. పాత తరం సినిమాల్లో విలనీజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాగభూషనం ఎంతో మంది ప్రతినాయకులకు ప్రత్యేక గుర్తింపుగా మిగిలిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: