చిరంజీవి సినిమా అనగానే ప్రేక్షకులకు ముందు నుంచి కూడా ఒకరకమైన క్రేజ్. అగ్ర హీరో గా ఒక వెలుగు వెలిగారు చిరంజీవి. ఆయన కెరీర్ లో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఒకప్పుడు హిట్ రేటింగ్ ఎక్కువగా ఉన్న హీరో కూడా చిరంజీవి. టాలీవుడ్ లో ఆయన సినిమాలు అనగానే బాలీవుడ్ లో కూడా జనాలు ఎదురు చూసే వారు అంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో మంచి సినిమాలు చేసిన చిరంజీవి కి కొన్ని సినిమాలు మాత్రం చాలా బలం అయ్యాయి. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా ఏది అయినా ఉందీ అంటే అది కచ్చితంగా ఇంద్రా సినిమా. అప్పటి వరకు ప్రేక్షకులకు చిరంజీవి అనగానే మాస్ హీరో అనే గుర్తింపు ఉండేది. కాని ఆ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ మారిపోయింది. అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లోకి రావాలి అనే డిమాండ్ లు చాలానే వచ్చాయి అనేది వాస్తవం. ఆ సినిమా ఆయన కెరీర్ లో బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఆ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఆయనను చూసి వేరే హీరోలు కూడా షాక్ అయ్యారు అంటే చిరంజీవి కెరీర్ లో ఆ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సినిమా తర్వాత చిరంజీవి కి పెద్ద పెద్ద ఆఫర్లు కూడా వచ్చాయి. 

 

బాలీవుడ్ లో సినిమా చెయ్యాలి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాని ఆయన మాత్రం చాల జాగ్రత్తగా సినిమాలు చేసారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమా కూడా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: