IHG

 

కరోనా కారణంగా దేశ ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరి కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలు మరియు సినీ ప్రముఖులు వారికి సహాయం చేసే మహత్తర  కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నా వైద్య సిబ్బంది కోసం ఫేస్ బుక్ వినూత్నంగా  వివిధ రంగాల సెలబ్రిటీలతో  ఆన్ లైన్ ఫండ్  రైజింగ్ చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. భారత్లో విరాళాల సేకరణ కు గాను "ఐ ఫర్ ఇండియా" పేరుతో పేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటులు మరియు సెలబ్రిటీలు అయినటువంటి షారుక్ ఖాన్, విద్యాబాలన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్,  మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి  బాలీవుడ్ సినీ ప్రముఖులు లైవ్ లో పాల్గొన్నారు.

IHG's performance with AbRam wins hearts; Hrithik ...

 

 

ఈ సందర్భంగా వారంతా పాటలు పాడుతూ మరియు కవి పంక్తులను చదివి వినిపించారు. దాదాపుగా ఈ లైవ్ ప్రోగ్రాం లో 85 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఐ ఫర్ ఇండియా కార్యక్రమానికి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్  జోహర్ జోయా అక్తర్  వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం లో వీక్షకుల ద్వారా 4.3 కోట్లు మరియు దాతల నుండి 47.77 కోట్లు విరాళం అందింది. వీక్షణలు మరియు విరాళాల ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం 50 కోట్లు గా నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా కరణ్ జొహార్ తన ట్విటర్ ఖాతా నుండి....  కన్సల్ట్ లా ప్రారంభమైన ఈ ఉద్యమం కి ప్రతి ఒక్కరూ తమకి  తోచినంత విరాళాలు అందించండి... అని ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: