సినిమాల్లో హీరో తన హీరోయిజం ఎలాగైనా చూపించొచ్చు. కానీ.. కామెడీ చేయడమే కష్టం. దీంతో హీరో అంటే కేవలం ఫైట్లు, పాటలే కాకుండా కామెడీ కూడా చేయడం మొదలు పెట్టారు. అలా సినిమాల్లో కామెడీ చేసే హీరోలు వచ్చారు. అలాంటి వారిలో కామెడీ కింగ్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరో రాజేంద్రప్రసాద్. నవ్వులరేడు, నటకిరీటి బిరుదులతో తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయనను స్టార్ హీరోగా మార్చిన సినిమా అంటే ‘లేడీస్ టైలర్’ అనే చెప్పాలి.

IHG

 

వంశీ దర్శకత్వంలో 1986లో వచ్చిన ఆ సినిమా రాజేంద్రప్రసాద్ ని స్టార్ హీరోగా మార్చేసింది. సినిమా అంతా రాజేంద్రప్రసాద్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి డైలాగ్, యాక్షన్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తయి. ఊరి మొత్తానికి ఒక్కడే లేడీస్ టైలర్ పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించాడు. ‘సుజాతా.. మై మర్ జాతా’ అనే సీన్ సింగిల్ టేక్ లో చేసి ఔరా అనిపించాడు. ఈ పినిమాతో రాజేంద్రప్రసాద్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సామాన్యమైంది కాదు. ఆ తర్వాత వరుసగా హాస్య ప్రధానమైన సినిమాలెన్నో రాజేంద్రుడు హీరోగా వచ్చాయి. కేవలం తన మీదే సినిమా బిజినెస్ అయ్యే రేంజ్ కి, రచయితలు, దర్శకులు కథలు రాసుకునే స్థాయికి చేరుకున్నాడు.

IHG

 

జయమ్ము నిశ్చయమ్మురా, జూలకటక, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, అహనా పెళ్లంట, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ఎన్నో సూపర్ హిట్లు,చ బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. కామెడీ ద్వారా ఓ హీరో ఈ స్థాయి హిట్లు ఇవ్వడం విశేషం. ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు సైతం.. ‘రాజేంద్రప్రసాద్ సినిమాలు చూస్తూ పని ఒత్తిడి తగ్గించుకుంటాను’ అని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. లేడీస్ టైలర్ సినిమాతో రాజేంద్రప్రసాద్ క్రియేట్ చేసిన మ్యానియా అది.

మరింత సమాచారం తెలుసుకోండి: