రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. అదికూడా తన మీద నెగటివ్ వార్తలు రాసిన ఓ సైట్ మీద పట్టలేనంత కోపం వచ్చింది. అంతకుముందే తన సినిమాల మీద పగబట్టి మరి ఫేక్ న్యూస్ రాస్తున్న ఆ వెబ్ సైట్ లేటెస్ట్ గా విజయ్ చేస్తున్న మిడిల్ క్లాస్ ఫండ్ మీద రకరకాల వార్తలు రాసింది. సినిమాల విషయంలో లైట్ తీసుకున్న విజయ్ ఈసారి వెనక్కి తగ్గకూడదని అనుకున్నాడు. వెంటనే ఓ వీడియో రిలీజ్ చేశారు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అడగడానికి మీరెవరు..? నేను చేసిన సహాయం 'కేవలం' 'మాత్రమే'.. అని పదాలను వాడారు.. మరి మీరేం చేస్తున్నారు అంటూ సదరు వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ చూపిస్తూ ఏకిపారేశారు విజయ్ దేవరకొండ.   

 

విజయ్ ఎందుకు స్పందించాడు :

 

ఇంతకీ విజయ్ ఎందుకు ఆ విధంగా స్పందించాడు అంటే.. తాను ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ గురించి తప్పుడు వార్తలు రాయడం వల్ల స్పందించాల్సి వచ్చిందని అన్నాడు. అంతేకాదు కేవలం 2000 మందికి సహాయం చేస్తున్నాడా.. ఫ్యాన్స్ సాయంతో 7500 మందికి సహాయం చేశాడా.. విజయ్ మరో ఇండస్ట్రీ పెడుతున్నాడా అంటూ వార్తలు రావడంపై బాగా హర్ట్ అయ్యాడు. ఈ సదరు వెబ్ సైట్ రెండు రోజుల క్రితం తన ఇంటర్వ్యూ అడిగితే కుదరదని చెప్పా అందుకే ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యాడు విజయ్. 

 

నోరు జారిన విజయ్ :

 

ఇక వీడియోలో తన వర్షన్ తానూ మాట్లాడుతూ మీరు బ్రతికేది మా మీదే అన్న మాట మాట్లాడాడు విజయ్ దేవరకొండ. అయితే సినిమా ప్రమోషన్స్ కు మీడియా సపోర్ట్ కంపల్సరీ అలాంటిది మీరు బ్రతికేది మా మీదే అనే మాట అతని నోటా నుండి రావడం దురదృష్టకరం. అయితే తన మీద వచ్చిన తప్పుడు వార్తలను ఖండిస్తూ దేవరకొండ విజయ్ కోపంతో అలా మాట్లాడాడని 

 

స్టార్స్ కూడా సపోర్ట్ :

 

ఇక వెబ్ సైట్స్ మీద.. ఫేక్ న్యూస్ ల మీద విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన వీడియోకి స్టార్స్ సపోర్ట్ అందుతుంది. ముందుగా మెగా బ్రదర్ నాగబాబు దీనిపై స్పందించి వెబ్ సైట్స్ జలగల్లా తయారై ఇండస్ట్రీ రక్తాన్ని తాగుతున్నారని అన్నారు. నా సపోర్ట్ నీకు ఉంటుందని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ కూడా విజయ్ వీడియోని ట్యాగ్ చేస్తూ నీకు అండగా ఉంటానని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ వీడియోపై రెస్పాండ్ అయ్యారు. మీ ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను విజయ్.. బాధ్యతలేని రాతల వల్ల మీలా నేను నా కుటుంబం చాలాసార్లు బాధపడ్డామని.. మీకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయకూడదని జర్నీ స్నేహితులకు చెప్పారు. ఇక డైరక్టర్స్ కొరటాల శివ, అనీల్ రావిపూడి కూడా విజయ్ కు అండగా నిలిచారు. ఇది ఒక హీరో సమస్య కాదు.. మొత్తం పరిశ్రమ సమస్య అందుకే విజయ్ మాటలకు పరిశ్రమ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. 

 

వాట్ నెక్స్ట్ :

 

ఫేక్ న్యూస్ లు రాసే సైట్స్ గురించి పరిశ్రమ పెద్దలు ఒక టీంను ఏర్పరిస్తే బాగుంటుంది. సినిమా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసినా.. పర్సనల్ ఎటాక్ చేస్తే చట్టపరమైన యాక్షన్ తీసుకునేలా ఒక తీర్మానం చేసుకోవాలని అనుకుంటున్నారు.  

 

ఒకరికి మరొకరి అవసరం : 

 

విజయ్ తన మాటల్లో తొందరపాటుగా మీరు బ్రతికేది మా మాదే.. సినిమా వాళ్ళ మీదే అని అన్నాడు.. ఆ మాట తన పరంగా కరెక్ట్ అనిపించి ఉండొచ్చు కానీ.. మీడియా మొత్తం కేవలం ఒక హీరో మీదనో.. లేక వాళ్ళిచ్చే యాడ్స్ మీదనో బ్రతికే అవసరం లేదు. వాళ్ళకంటూ కొన్ని ఆదాయ మార్గాలు ఉన్నాయి. కేవలం సినిమా వాళ్ళు యాడ్స్ ఇస్తేనే వెబ్ సైట్స్ బ్రతుకుతాయి అన్న విజయ్ మాటలు మాత్రం కొద్దిగా నొప్పించేలా ఉన్నాయి. అంతేకాదు మీడియా, సినిమా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా వాళ్లకు మీడియా సపోర్ట్ కావాల్సిందే.. సినిమా న్యూస్ లు రాస్తేనే మీడియా బాగుటుంది. ఇలా ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి ఇక్కడ ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు. అయితే నిజమైన జర్నలిజం విలువలతో సమాజానికి ఉపయోగపడేలా వార్తలు రాస్తే మంచిది. ఇక సినిమాల విషయానికొస్తే సినిమా బాగుంది బాగాలేదు అనే స్వేచ్ఛ.. దానిపై రివ్యూస్ జరిపే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి పంథాలో వారు కొనసాగితే అంతా బాగుంటుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: