రౌడీ స్టార్ గా అభిమానుల్లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాను ఏం చేసినా ఓ ఇంపాక్ట్ క్రియేట్ అవడం అతని స్టార్ ఇమేజ్ కు నిదర్శనం. స్టేజ్ మీద మాట్లాడినా, సినిమా చేసినా, సోషల్ మీడియాలో యాక్టివిటీ అయినా.. విజయ్ కేరాఫ్ సెన్షేషన్ గా మారిపోయాడు. రీసెంట్ గా మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో చారిటీ ప్రారంభించాడు. 25లక్షల ఫండ్ తో మొదలు పెడితే 75లక్షల వరకూ వెళ్లింది. సాయం అందుకునే కుటుంబాలూ పెరిగాయి. ఇందుకు పూర్తిగా సన్నద్ధమయ్యాడు విజయ్.

 

 

తానెంత కష్టపడి ఈ చారిటీ చేస్తున్నాడో కూడా వివరించాడు విజయ్. అయితే ఓ వెబ్ సైట్ విజయ్ చేస్తున్న చారిటీని పూర్తిగా కించపరచడంతో విజయ్ కు కోపం వచ్చింది. ఓ వీడియో రూపంలో తాను చేస్తున్న పనిపై ఎలాంటి విషం కక్కుతున్నదీ పూస గుచ్చినట్టు వివరించాడు. సదరు వెబ్ సైట్ రాతలు తనతో పాటు ఇండస్ట్రీనే కించపరచినట్టు ఉన్నాయని అన్నాడు. నిరాధారమైన వార్తలు రాస్తూ.. సాయం ఎలా చేయాలో చెప్పే బదులు ఆ సాయం మీరు చేయొచ్చు కదా అని ఓ ఆట ఆడుకున్నాడు. నేనెలా సాయం చేయాలో నాకు తెలుసు. మీరెవరు నాకు చెప్పడానికి అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

 

 

దీంతో విజయ్ వేసిన డేరింగ్ స్టెప్ కు ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ తో మొదలైన సంఘీభావం, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, పూరి జగన్నాధ్, రానాతో పాటు చాలామంది అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వేవ్ మొత్తం ఇండస్ట్రీ మూవ్ గా నడుస్తోంది. ఇలాంటి వార్తలు రాయకుండా ఉండేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి షాక్ ఇస్తోంది. ఇకపై విజయ్ కు మద్దతుగా మరెంత మంది నిలుస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: