కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. వాస్తవంగా క‌రోనా లేకపోయి ఉంటే ఈ పాటికి థియేటర్లు అన్ని సినిమాల‌తో కళ‌కళ‌లాడుతూ ఉండేవి. ఇప్పుడు స‌మ్మ‌ర్‌లో అంతా పెద్ద సినిమాల హంగామాతో నడిచేది. ఇప్పుడు ఉన్న నేపథ్యంలో షూటింగ్‌లు బంద్ కావడంతో అటు సినిమాల రిలీజ్ లు సైతం ఆగిపోయాయి. ఈ క్రమంలోనే జూన్ నుంచి ప్రారంభం అయ్యే ఈ పెద్ద సినిమాల షూటింగ్ లపై సైతం ఈ ఎఫెక్ట్ దారుణంగా ఉండబోతుందట. మహేష్ బాబు - పరశురాం కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించినంతగా అడ్వాన్సులు రావటం లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 

మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమా కొట్టి మంచి స్వింగ్‌ లో ఉన్న కూడా ఇప్పుడు మహేష్ కొత్త సినిమా ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇక ఇదే ప‌రిస్థితి బ‌న్నీ పుష్ఫ‌కు కూడా ఉందంటున్నారు. అటు సుకుమార్‌, ఇటు బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో సినిమా త‌ర్వాత చేస్తోన్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.  బడా స్టార్ హీరోలు నటించే క్రేజీ ప్రాజెక్టుల విషయమే ఇలా ఉంటే క్రేజ్ తక్కువగా ఉండే..పెద్దగా డిమాండ్ లేని హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అంచనా వేయవచ్చు.

 

ఇక అడ్వాన్స్‌లు మాత్ర‌మే కాదు. ప్రి రిలీజ్ బిజినెస్ లు స్టార్ట్ చేసిన సినిమాల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌ట‌. అడ్వాన్స్‌లు ఇవ్వం... రిలీజ్ చేశాక వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టే మీకు అమౌంట్ ఇస్తామ‌ని బ‌య్య‌ర్లు చెపుతున్నార‌ట‌. దీంతో బ‌డా నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. ఏదేమైనా మ‌రో యేడాది వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌న్న ఆందోళ‌న కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు సినిమా రంగం పుంజుకునే ఛాన్సులు క‌న‌ప‌డ‌డం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: