నాగచైతన్య తర్వాతి సినిమాకు అధృష్టం కలిసిరావడం లేదా.. క్రేజీ కాంబినేషన్.. బిజినెస్ కు హెల్ప్ కావడం లేదా.. అంటే ట్రేడ్ వర్గాల్లో అవుననే అంటున్నారు. శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్, సాయిపల్లవి లాంటి ఎక్స్ లెంట్ కోస్టార్ ఉన్నప్పటికీ లవ్ స్టోరీ మూవీ బిజినెస్ టార్గెట్ దాటడం లేదట. ఇందుకు వెంకీమా, సామ్ లను బూచీగా చూపుతున్నట్టు టాక్. 

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ కరోనా క్రైసిస్ రాకపోతే లవ్ స్టోరీ ఈనెలలోనే రిలీజయ్యేది. 15రోజుల ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయినట్టే తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 22న లవ్ స్టోరీని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. 

 

లవ్ స్టోరీ బిజినెస్ పై ట్రేడ్ వర్గాల్లో ఓ ఇంట్రెస్ట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను 40 కోట్ల రేంజ్ లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ బయ్యర్లు ముందుకు రావడం లేదట. చైతు నటించిన చివరి రెండు సినిమాలు మజిలీ, వెంకీమామకు 40కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. దీంతో లవ్ స్టోరీ రేట్లు కూడా అదే స్థాయిలో కోట్ చేస్తుంటే బయ్యర్లు మాత్రం అదే సినిమాలు చూపించి రేటు తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

మజిలీలో సమంతా ఫ్యాక్టర్.. వెంకీ మామలో వెంకటేశ్ ఫ్యాక్టర్ ఉండటంతో ఆ రేంజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారట. ఈ సినిమాకు అలాంటి ప్లస్ పాయింట్ ఏమీ లేవని కొందరు అంటున్నట్టు టాక్. ఈ వాదన సరైందని కాదని మరికొందరు అంటున్నారు. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి లవ్ స్టోరీ కోసం వర్క్ చేస్తున్నారు. లవ్ స్టోరీ క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. కానీ కొందరు కావాలనే చైతూను డిగ్రేడ్ చేసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారట. ఇప్పటికే రిలీజైన లవ్ స్టోరీ ప్రోమోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా మరో క్లాసిక్ హిట్ గా నిలుస్తోందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: