వెబ్ సిరీస్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే అక్కడంతా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం ఉన్నా కూడా మంచి హారర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా వస్తున్నాయి. ఇక ఇంటెలిజెంట్ కంటెంట్ తో తీసే వెబ్ సిరీస్ కి కూడా యమ డిమాండ్ ఉంది. రానున్న కాలమంతా వెబ్ మీడియాదేనని అంతా అంటున్న సందర్భమిది.

 

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న తరం ఇప్పటిది. వారి వద్దకు నేరుగా బొమ్మ చేర్చడం అంటేనే ఆడియన్ని డైరెక్ట్ గా పట్టేయడమే. పెద్ద తెరలు, సినిమా హాళ్ళు కూడా ఇపుడు ఓల్డ్ ట్రెడిషన్ అయిపోతున్నాయి. పైగా బిజీ బిజీ లైఫ్. దాంతో వెబ్ మీడియాను ఆదరణ పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ నేపధ్యంలో నుంచి చూసుకుంటే వెబ్ సీరీస్ లో మెగాస్టార్ మెరుస్తారన్న న్యూస్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్  వెబ్ సిరీస్ లో మెరిసే రోజు తొందరలోనే ఉందని అంటున్నారు.

 

బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పార్టనర్ గా ఓటీటీ ఫ్లాట్ ఫారంపై త్వరలో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పనులు లాక్ డౌన్ తరువాత మొదల్వుతాయని అంటున్నారు. టాలీవుడ్లో మాత్రం ప్రస్తుతం  ఈ వార్తలు చక్కరులు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ ఏకంగా వెండి తెర నుంచి దిగి వచ్చి వెబ్ సిరీస్ లో కనుక నటిస్తే ఆ వూపు వేరేగా ఉంటుంది.

 

ఇక వెబ్ సిరీస్ కి అది పెద్ద డిమాండ్ గా మారుతుంది. వెబ్ సిరీస్ గురించి అంతా మాట్లాడుకుంటారు. మరింతమంది కొత్త ఆడియన్స్ కూడా వచ్చి చేరుతారు. ఏది ఏమైనా మెగాస్టార్ తన నట జీవిత ప్రస్తానంలో ఇదొక మేలి మలుపుగా మారుతుందేమో చూడాలి. మెగాస్టార్ దిగితే ఇక కుమ్ముడే కుమ్ముడేగా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: