సినిమాలు చేసినా చేయకపోయినా కొందరికి క్రేజ్ అనేది అలాగే ఉంటుంది. వారిలో ప్రధానంగా చెప్పుకునేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు చేసే హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా వస్తే చాలు పనులు మానుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ ఉంది అనేది వాస్తవం. ఆయన ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

 

సినిమా తర్వాత ఆయన క్రిష్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కోసం ఒక బాలీవుడ్ నిర్మాత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పవన్ తో సినిమా చేస్తా అని ఆయన లాక్ డౌన్ ముందు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉండిపోయారు అని పవన్ ని కలిసిన ఆయన ఒక కథ కూడా వినిపించగా పవన్ కళ్యాణ్ ఆ కథకు ఓకే చెప్పారు అని ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు పవన్ కి  ఒక క్రేజ్ ఉంది అది మరీ పెరిగింది అని భావించిన సదరు నిర్మాత ఎలా అయినా సరే పవన్ తో సినిమా చెయ్యాలి అని గట్టిగా పట్టుదల గా ఉన్నారని టాక్ వినపడుతుంది. త్వరలో నే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమా దర్శకుడు ఎవరో...

మరింత సమాచారం తెలుసుకోండి: