ఆచార్య సినిమా కోసం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారు. వ్యక్తిగతం గా కూడా ఆయన ఈ సినిమా మీద ప్రాణం పెట్టారు అని టాలీవుడ్ లో జనం అంటున్నారు. ఆయనకు ఇప్పుడు మంచి విజయం కావాలి అని అందుకే ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలి అని చిరంజీవి భావిస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమాలో కొందరు బాలీవుడ్ నటులు కూడా కనపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే.. 

 

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ లేదా జునియర్ ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు ని తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎవరిని తీసుకునే అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలియదు గాని ఒక యువ హీరో కి మాత్రం మంచి పాత్ర ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రకు గానూ రామ్ చరణ్ ఓకే అనకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. చిరంజీవి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో చేయని పాత్ర ఈ సినిమా కోసం చేస్తున్నారు . 

 

ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఖాళీ ఉండే అవకాశం లేదు. అదే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకుంటే మంచిది అని సినిమాకు కూడా బాగా కలిసి వస్తుంది అని చిరంజీవి భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ సినిమా వచ్చే  ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: