టాలీవుడ్ లో కొందరు నటులు మనకు అలా గుర్తుండి పోతూ ఉంటారు. అందులో కొందరు సీనియర్ నటులు కూడా ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్ద పాత్రలు చేసినా సరే వారి గురించి మాత్రం టాలీవుడ్ లో పెద్ద పెద్ద చర్చలే జరుగుతూ ఉంటాయి. కొంత మంది నటన కు కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎవరి గురించి అంటే ప్రముఖ రచయిత, విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి గురించి. ఆయన మాటలకు చాలా పదును ఉంటుంది. ఆయన నటనకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఏ హీరో సినిమా అయినా సరే ఆయన పాత్ర పోషిస్తే ఒక క్రేజ్ అనేది ఉంటుంది. 

 

ఆయన పాత్ర ఎలా ఉంది అనేది కొందరు ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇక ఆయనకు రచయిత గా కూడా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు  ఇప్పుడు ఒక పెద్ద ఆఫర్ వచ్చినట్టు సమాచారం. తనకు మంచి కథ కావాలి అని మహేష్ బాబు తనికెళ్ళ భరణి ని అడిగారు అని సమాచారం. తనకు ఒక మంచి ఫ్యామిలీ సినిమా చెయ్యాలని ఉందని అందుకు మీ సహకారం కావాలి అని కథ అడిగారట మహేష్ బాబు. దీనితో తనికెళ్ళ భరణి ముందు నో చెప్పినా సరే తర్వాత ఓకే చెప్పారు అని టాక్. 

 

కథ రెడీ చేసి ఇవ్వాలని డబ్బుల గురించి ఆలోచించవద్దు అని తాను ఎంత అయినా సరే ఇస్తాను అని ఆయనకు చెప్పినట్టు సమాచారం. తనకు ఫ్యామిలీ సినిమాలు ఇష్టం అని ఇటీవలి కాలంలో తాను చేసినవి అన్నీ కూడా ఫ్యామిలీ కి దూరంగా ఉండే సినిమాలే అని ఒక మంచి కథ కావాలని మహేష్ స్వయంగా అడగడం తో కథ రెడీ చేస్తున్నారట ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: