టాలీవుడ్ లో అడుగు పెట్టి పదేళ్ళు అయినా సరే కాజల్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె సినిమాలకు ఏమో గాని ఆమె వ్యక్తిత్వానికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఆమె ఆఫర్లు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఏ సినిమా పడితే ఆ సినిమా ఆఫర్ వచ్చింది కదా అని చేసే అవకాశం ఉండదు అని చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలను చేస్తూ ఉంటుంది అని ప్రేక్షకులు ఆమె అభిమానులు సినీ పరిశీలకులు అంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె సీనియర్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఆమెకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. యువ హీరోయిన్ ల హవా అనేది ఎక్కువగా కొనసాగుతుంది. ఈ తరుణంలో కూడా ఆమె ఒక ఆఫర్ వస్తే అనవసరంగా తొందరపడకుండా సినిమా చేసింది అని టాక్. చిరంజీవి ఆచార్య సినిమా కోసం దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. ఆమె తాను చెయ్యాలి అంటే ఇంత కావాలి అని మొహం మీదే చెప్పింది అని అంటున్నారు. నిర్మాత వెనక్కు తగ్గినా సరే ఆమె మాత్రం తగ్గకుండా డిమాండ్ చేసి ఓకే చేసింది అని టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆచార్య సినిమా గురించే చర్చలు అన్ని కూడా. 

 

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు కీలక పాత్ర చేసే మరో హీరో ఎవరు అనే దాని మీద ఎక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హీరోయి న్ మాత్రం ఎప్పటికి ఖరారు అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా కూడా హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా మీద చిరంజీవి చాలా ఆశలు పెట్టుకున్నారు అని సమాచారం. ఆయన చాలా కష్టపడుతున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: