ఆర్ఆర్ఆర్... ఇప్పుడు ఈ సినిమా గురించే టాలీవుడ్ లో చర్చలు అన్నీ కూడా. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ప్రత్యేకంగా చదువుతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటుగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ప్రోమో కూడా ప్రేక్షకులకు వచ్చింది. ఈ సినిమాను టాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ సినిమా గా చూస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడుతున్నారు కూడా. ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని కొన్ని పాత్రలను యాడ్ చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో కొందరు బాలీవుడ్ నటులను తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నారు అని అంటున్నారు. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో ని కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక కీలక పాత్ర కోసం రానా ని తీసుకునే అవకాశం ఉందనే ప్రచార౦ జరుగుతుంది. రానాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇవ్వడానికి రాజమౌళి కష్టపడుతున్నారు అని అంటున్నారు. 

 

సినిమా కు రానా షూటింగ్ లో హెల్ప్ చేసారు అని అందుకే ఆయనకు ఒక మంచి పాత్ర ఇస్తే బాగుంటుంది అనే భావన లో దర్శకుడు ఉన్నారు అని సమాచారం.  కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎలా అయినా సరే విడుదల చెయ్యాలి అని దర్శకుడు నిర్మాతలు చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: