ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషాదం నుంచి కోలుకోక ముందే బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో రిషీ కపూర్ కన్నుమూశారు.  తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకొన్నది. యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిలో కూరుకుపోయారు. మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దాంతో రవాణా వ్యవస్థ పూర్తిగా షట్ డౌౌన్ అయ్యింది.  లాక్ డౌన్ కారణంగా తన సహచర నటుడి చివరి చూపు చూసుకోలేని పరిస్థితి ఏర్పడటంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. బేసిల్ జార్జ్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.   

 

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న బేసిల్ జార్డ్‌ యాక్సిడెంట్‌లో మరణించాడన్న వార్త ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు సహ నటులు.   డ్రైవర్ మరో ముగ్గురు మొత్తం ఐదుగురు ఒకే కారులో కొలెంచెర్రీ నుంచి మువత్తపుజా వైపు వెళ్తున్న సమయంలో కారుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఎదురుగా ఉన్న షాప్, ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఈ ఘటన మువట్టుపుజా దగ్గర ఆదివారం రాత్రి చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు.

 

ఈ దుర్ఘటనలో బేసిల్ జార్జ్‌తోపాటు మరో ఇద్దరు మరణించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని  ఫైర్, పోలీస్ సిబ్బంది కాపాడి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.  ఫైర్, పోలీస్ సిబ్బంది కాపాడి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆయన నటించిన పూవల్లియమ్ కుంజడమ్ చిత్రం మంచి ప్రేక్షకదారణ పొందింది. బేసిల్‌కు తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బేసిల్ జార్జ్ మృతికి పలువురు మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: