అక్కినేని వంశం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. హీరోగా తెరంగేట్రం చేసిన నాటి నుంచి తన వయసుకు తగ్గ సబ్జెక్టులు సెలక్ట్ చేసుకుంటున్నాడు. అక్కినేని వంశానికి బాగా కలిసొచ్చిన లవ్ సబ్జెక్టులను ఎంచుకుని హిట్లు సాధిస్తున్నాడు. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా రెండో సినిమా ‘ఏ మాయ చేశావె’ తో తొలి హిట్ అందుకున్నాడు. మూడో సినిమాగా చేసిన 100% లవ్ తో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. నేటితో ఆ సినిమా విడుదలై 9ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 2011 మే6వ తేదీన విడుదలైంది. చైతన్యకు జోడీగా తమన్నా నటించింది. బాలు-మహాలక్ష్మీ పాత్రల్లో కాలేజీ స్టూడెంట్స్ గా, బావా మరదళ్ల సరసాలతో, అల్లరితో చైతూ – తమన్నా ఫస్టాఫ్ లో ఆకట్టుకుంటారు. సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను యాడ్ చేసి ప్రేమ, పెళ్లికి ఉన్న ఇంపార్టెన్స్ ను సమపాళ్లలో చూపించాడు సుకుమార్. ఏ మాయ చేసావే తో వచ్చిన హిట్ ను ఈ సినిమాతో కంటిన్యూ చేశాడు చైతూ. సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ హీట్టే. ‘అహో బాలు, దటీజ్ మహాలక్ష్మీ, డియాలో డియాల’ పాటలు సూపర్ హిట్టయ్యాయి.

IHG

 

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించాడు. మెగా కాంపౌండ్ లో నాగ చైతన్య నటించిన ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా హిట్ అయింది. 65 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా 100 రోజులు 7 సెంటర్లలో రన్ అయింది. ఆర్య2 తర్వాత సుకుమార్ కు హిట్ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: