ఆర్ఆర్ఆర్ (రౌద్రం,రణం,రుధిరం)లో బాలీవుడ్ యువ  హీరోయిన్  అలియా భట్ నటించడం లేదంటూ మొన్నటి వరకు వార్తలు రాగ దానిపై సినిమా యూనిటే క్లారిటీ ఇచ్చింది. ఆతరువాత అలియా కు సినిమాలో ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి తాజాగా అలియా రోల్ పై స్వయంగా డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. 
 
సీత పాత్ర  పోషించగలే నటి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రతిభావంతులైన నటుల మధ్య  నిలబడగలిగి ఉండాలి. అలాగని ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు  సీత అమాయకంగా వుంటూ ప్రమాదకారిగా కనిపించాలి అందుకే  ఈపాత్ర కు అలియా భట్ ను తీసుకున్నామని రాజమౌళి అన్నాడు. దాంతో అలియా కు సినిమాలో  ప్రాధాన్యత వున్న పాత్రే దక్కిందని తెలుస్తుంది. తదుపరి జరిగే షెడ్యూల్ లో అలియా జాయిన్ కానుంది. ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన రామ్ చరణ్  పాత్ర తాలూకు టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే రోజున కూడా ఆర్ఆర్ఆర్ నుండి మరో సప్రైజ్ రానుంది. 
 
స్వాతంత్య సమరయోధులు కొమరంభీం ,అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్  కొమురం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు గా కనిపించనున్నాడు అలాగే అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటించనుంది. వీరితో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరో  అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డివివి ఎంటెర్టైనెంట్స్ పతాకం పై సుమారు 400 కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: