శ్రీదేవి, బహుశా ఈ పేరు తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అనే చెప్పాలి. ముందుగా కొన్నేళ్ళ క్రితం బాలనటిగా సినిమారంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి, అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి చిన్నతనంలోనే తన అద్భుతమైన నటనతో మంచి పేరు సంపాదించారు. ఇక పెరిగి పెద్దయ్యాక 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముడిచు అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ తర్వాత మెల్లగా తమిళంతో పాటు తెలుగు సహా పలు ఇతర భాషల్లో హీరోయిన్ గా పలు అవకాశాలు సంపాదిస్తూ ముందుకు సాగారు. 

 

80వ దశకంలో పలు భాషల్లో ఉన్న అప్పటి అగ్ర కథానాయకులు అందరితోపాటు, 90వ దశకంలో కూడా కూడా దాదాపుగా అందరు హీరోల సరసన జోడీ కట్టిన శ్రీదేవి అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆపై కొన్నాళ్ల తర్వాత అన్ని భాషల్లో కూడా దాదాపుగా సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీదేవికి, భారతదేశం మొత్తం కూడా విపరీతమైన పేరుప్రఖ్యాతలు దక్కాయి. ఇక తెలుగులో అనేక అద్భుతమైన సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి లో ఇంద్రజ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచారు. నిజంగా ఆ సినిమా చూస్తున్నంతసేపు, స్వయంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి మాదిరిగానే శ్రీదేవి తెరపై కనిపించే వారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

 

ఇక ఆ తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు విరామం పలికి బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి, ఆపై పూర్తిగా ఫ్యామిలీ జీవితానికి అంకితమయ్యారు. ఇటీవల కొన్నేళ్ళ క్రితం వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆపై పులి, మామ్ సినిమాల్లో నటించి వయసు పెరిగినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు. ఇక ఇటీవల దుబాయ్ లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి, ప్రస్తుతం మన మధ్యన లేనప్పటికీ ఆమె పోషించిన అనేక పాత్రల ద్వారా మనకు ఎప్పుడూ గుర్తుకు వస్తూనే ఉంటారు అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: