ప్రతి హీరోకు కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి.. అవి వారి జీవితాన్నే మలుపుతిప్పుతాయి.. కొన్ని సినిమాలు జీవితాన్ని సక్సెస్ చేస్తే.. మరి కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ దిశగా వెళ్లి జీవితాన్ని నాశనం చేస్తాయ్.. అలాగే ప్రభాస్ స్టార్ ని ఓ రేంజ్ లో పెంచిన సినిమా బాహుబలి.. అప్పటివరకు టాలీవుడ్ కే పరిమితం అయినా ప్రభాస్ ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. 

 

ప్రభాస్ ని పరిచయం అని కాదు కానీ చిన్న చిన్న సినిమాలు.. అందరి హీరోలలానే ప్రభాస్ కూడా.. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  సినిమా.. ఇంకా అది కూడా భారీ బడ్జెట్.. అందుకే.. భారీ బడ్జెట్ కి  తగ్గట్టుగానే సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యింది.. అంత గొప్ప సినిమా అయ్యింది ప్రభాస్ సినిమా.. 

 

ప్రపభా కెరీర్ కి బాహుబలి అనే సినిమా ఓ మలుపు.. బాహుబలినే సూపర్ హిట్ అవుతే.. బాహుబలి 2 మరో సూపర్ హిట్.. ఇంకా ఏముంది.. ప్రభాస్ సినీ జీవితం ఆకాశానికి వెళ్ళింది... దీంతో ప్రభాస్ తదుపరి చిత్రం కోసం వెయిట్ చేశారు.. ఓ కొత్త డైరెక్టర్ చేతిలో సినిమా.. భారీ బడ్జెట్.. భారీ ఊహల మధ్య సినిమా విడుదల అయ్యింది.. కానీ అభిమానుల ఊహలను ఈ సినిమా అందుకోలేకపోయింది.. 

 

దీంతో సినిమా యావరేజ్ టాక్ వచ్చింది.. కానీ ప్రభాస్ కి ఏలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు.. సినిమాలు ప్లాప్ అయితేనేం.. మా బాహుబలి.. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతాడు అని అందరూ ఆశించారు.. ఇప్పుడు అదే పనిలో ఉంటే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది.. దీంతో అంతర్జాతీయంగా షూటింగ్ లు ఆగిపోయాయి.. లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఇది పరిస్థితి. ఏది ఏమైనా ప్రభాస్ నెక్స్ట్ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: