కొందరు ఉంటారు.. మంచి నటి.. మంచి అందం.. మంచి పాత్రతో సినిమాల్లోకి ఎంటర్ అవుతారు.. తెలుగింటి ఆడపిల్లల భలే అందంగా ఉంది రా అని అనిపించేలా నటిస్తారు.. కానీ కొందరు ఉంటారు.. మంచి పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా సరే.. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఒక్క ప్లాప్ పడితే చాలు.. 

 

నెక్స్ట్ సినిమా ఎక్కడ హిట్ అవ్వదో అని అప్పటి వరుకు ఎక్స్ పోజ్ అంటే నో అన్న హీరోయిన్స్ ఎక్స్ పోజ్ కి సిద్ధం అయిపోతారు.. ఎక్స్ పోజ్ చేస్తారు.. ఇంకా ఆ సినిమా నుండి ప్రతి సినిమాలో పాత్ర కంటే కూడా ఎక్స్ పోజింగ్ ఏ ఎక్కువ ఉంటుంది.. ఇంకా కొన్ని సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా మారి మరి డ్యాన్స్ లు చేస్తారు.. అలాంటి హీరోయిన్స్ ని ఇప్పటికే చాలామందిని చూశాం.. 

 

కానీ ఒక్క హీరోయిన్ ఉంది.. సినిమాల్లో మీరు అవకాశాలు ఇవ్వడం కాదు.. నేను ఏ పాత్ర నచ్చితే చేస్తా లేకుంటే అవసరం లేదు అనే హీరోయిన్ ఉంది.. కోట్లు ఇచ్చిన సరే నేను ఎక్స్ పోజ్ చెయ్యను అని ముఖం మీదే చెప్పింది.. నాకు డబ్బు అవసరం లేదు.. మంచి సినిమాలో పద్ధతి గల అమ్మాయిల ఒక పాత్ర ఇస్తే చాలు.. నా నటన ఏంటో చూపిస్తా అని అంటుంది ఈ భామ.. 

 

ఆమె సాయి పల్లవి.. ఒక హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాల్సిన అవసరం లేదు.. మంచి నటన.. మంచి డ్యాన్స్ తెలిస్తే చాలు అని ఫిదా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది సాయి పల్లవి.. ఈ సినిమా అద్భుతం అనే చెప్పాలి. ఈ భామ మెడిసిన్ చదివింది... డబ్బు అవసరమే లేదు కానీ నటన అంటే పిచ్చి అందుకే సినిమాల్లో నటిస్తుంది.. అంతే తప్ప డబ్బు కోసమే మారేదానికోసమే కాదు.. ఎంత డబ్బు ఇచ్చిన మంచి పాత్ర అయితేనే చేస్తుంది ఈ సూపర్ పిల్ల. 

మరింత సమాచారం తెలుసుకోండి: