కీర్తి సురేష్.. ఎంత గొప్ప నటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తెరకు నేను శైలజ అనే మంచి సినిమాతో పరిచయం అయినప్పటికీ ఈ హీరోయిన్ కి అసలు నటనే రాదు.. ఎందుకండీ ఆమెను పెట్టారు అని అన్నారు.. అలాంటి హీరోయిన్ మహానటి అయ్యింది.. మహానటి సావిత్రి సినిమా చూస్తే మీకు ఏం అనిపిస్తుంది?  

 

నాకు అయితే మహానటి సావిత్రి గారి ఫోటో వేరు ఏమో.. ఈమె సావిత్రి ఏమో అనేంతలా కీర్తి సురేష్ నటించింది. థియటర్ లో చుసిన .. ఇంట్లో చుసిన మనకు సావిత్రి మన కళ్ళ ముందు నుండి పోదు.. అంతగొప్పగా నటించింది కీర్తి సురేష్.. అలాంటి నటికీ మహానటి తర్వాత మళ్లీ అంత గొప్ప సినిమాల్లో నటించ లేదు..                        

 

ఇంకా మహానటిలో ఎంతో క్యూట్ గా.. చబ్బీగా కనిపించిన కీర్తి సురేష్ బక్క చిక్కిపోయింది.. అమ్మ ఏమైంది నీకు? ఎందుకు ఇలా కనిపిస్తున్నావు అని అనేలా ఆమె తయారయ్యింది.. ఇంకా అది అండి సంగతి.. మహానటి అంత గొప్పగా నటించిన సరే ఎందుకు అంత మంచి పాత్రలు రావడం లేదో అర్థం కావడం లేదు..                     

 

కాగా కీర్తి సురేష్ తల్లి కూడా ఒక నటి ఏ అంట.. ఆమె మెగా స్టార్ చిరంజీవి పున్నమి నాగు సినిమాలో కూడా నటించారంటే.. అందులో మన చిరుకు పెయిర్ గా నటించారంట.. ఆమె మేనకా. ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మేనకా గారి కూతురే కీర్తి సురేష్..          

మరింత సమాచారం తెలుసుకోండి: