మెగా మేనళ్లుడు సాయి తేజ్ అదేనండి సాయి ధరమ్ తేజ్.. రేయ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా పిల్లా నువ్వు లేని జీవితం ముందు రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో కుర్రాడి ఈజ్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ ముచ్చటపడ్డారు. ఇక తర్వాత సినిమాలతో సాయి తేజ్ సుప్రీం హీరోగా సత్తా చాటాడు. సుప్రీం తర్వాత తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుస ప్లాపులతో కెరియర్ సందిగ్ధంలో పడేసుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అండదండలు ఉన్నాయి తను ఎలాంటి సినిమా చేసినా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్న సాయి తేజ్ కు సరైన షాక్ ఇచ్చారు మెగా ఫ్యాన్స్. 

 

ఇక వరుసగా ఆరు ప్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ యువ హీరో. చిత్రలహరి మాత్రమే కాదు ఆ తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమాతో కూడా సాయి తేజ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఓడి గెలిచినా ఈ మెగా హీరో ఇక మీదట కెరియర్ విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. సాయి తేజ్ వరుస ప్లాపులు చేస్తున్న టైం లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంది. చిత్రలహరితో హిట్ కొట్టగానే గీతా ఆర్ట్స్ 2లో మారుతి డైరక్షన్ లో ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ హిట్ ఇచ్చారు.

 

అయితే హిట్టు కొట్టాం కదా అని మళ్ళీ ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేస్తే మళ్ళీ ఆడియెన్స్ తిప్పికొట్టేస్తారు. అందుకే చేస్తున్న ప్రతి సినిమా చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాయి తేజ్ దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: