కేరళ కుట్టిస్.. నిజంగా క్యూట్ అబ్బా.. అందంతో పాటు దేవుడు వాళ్లకు కాస్త తెలివి కూడా ఇచ్చాడు.. అదే బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు కదా! అలా. ఇంకా కేరళ నుండి వచ్చిన బ్యూటీస్ టాలీవుడ్ లో ప్రేక్షకుల మనసు దోచేశారు. అలాంటి అద్భుతమైన అందమైన హీరోయిన్స్ ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నిత్య మీనన్... 

 

పెద్ద పెద్ద కళ్ళు.. ఉంగరాల జుట్టు తో అందమైన ముఖంతో అలా మొదలైంది, ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే లాంటి అద్భుతమైన సినిమాలు చేసి అభిమానులకు దగ్గరయింది.. హీరోయిన్ అంటే ఏవో కొన్ని డైలాగులు చెప్పి పాటల్లో కనిపించి పోవడం కాకుండా నటించడంలో నన్ను మించిన వారు లేరు అని అనిపించేలా చేసింది. 

 

అనుపమ.. 

 

ఇక్కడ అ ఆ సినిమాలో నాగవల్లి గా త్రివిక్రమ్ పరిచయం చేయకముందే.. మళయాళం సినిమాలో ప్రేమమ్ ద్వారా ముందే చేసేసాం.. ఇంకా ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా మేరీసి అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 


 
నాజిరియా నజిమ్.. 

 

ఈ ఒక్క సినిమాలోనే చుసిన ఈమెకు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు అంత అభిమానులయ్యారు. అంతా బాగా నటించేసింది. 

 

సాయి పల్లవి.. 

 

ప్రేమమ్ లో మలర్ పాత్ర లో ఎంత అద్భుతంగా నటించిందో.. తెలుగులో ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రక్షకులను ఫిదా చేసేసింది ఈ పిల్లా.. 

 

నివేత తోమర్.. 

 

అబ్బా ఈ బ్యూటీ గురించి నేను ఎం చెప్పను.. ఎందుకంటే ఈ బ్యూటీ అంత క్యూట్ గా ఉంటుంది.. లుక్స్ ఏ కాదు యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ హీరోయిన్ ది. 

 

మడోన్నా.. 

 

మన తెలుగులో ప్రేమమ్ సినిమాలో మాత్రమే కనిపించింది.. కానీ ఈ హీరోయిన్ అంటే మళయాళం సినీ లవర్స్ కి చాలా చాలా ఇష్టం మరి. 


 
మంజిమ మోహన్.. 

 

చూడ్డానికి కొంచెం బొద్దుగా ఉన్న ఆ మొహం లో కల బలే ఉంటుంది కదా.. గౌతమ్ మినాన్ సినిమాలో సాహసం శ్వాసగా సాగిపో లో హీరోయిన్ గా కనిపించింది. 

 

నయనతార.. 

 

ఏంటి ఈమె కూడా మళయాళం ఏ నా అని మీకు అనిపించచ్చు.. కానీ నిజం. గజినీ సినిమాతో పరిచయం అయినా ఈమె ఇప్పుడు సౌత్ అంత లేడీ సూపర్ స్టార్ అయ్యింది. 

 

కీర్తి సురేష్.. 

 

కీర్తి సురేష్ తమిళియన్.. మలయాళీ రెండు.. అమ్మ తమిళ్.. నాన్న మళయాళం. రెండు స్టేట్స్ కలిసి తెలుగు స్టేట్ లో సినిమాలు తీసింది.. ఈమె నటనకు మన తెలుగు అభిమానులు అలా పడ్డారు అంతే.. ఇంకా లేవలేదు. 

 

అమల పాల్.. 

 

మన తెలుగు అభిమానులకు బాగా దగ్గరైపోయింది ఈ బ్యూటీ.. మంచి మంచి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది. 

 

అను ఇమ్మానుయేల్.. 

 

యూస్ లో పుట్టింది కానీ కేరళ అమ్మాయి. నాని మజ్ను సినిమాలో నటించిన ఈమె వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించింది.. ఆ తర్వాత కూడా పెద్ద పెద్ద స్టార్స్ సరసనే నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: