దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన అద్భుత దృశ్యకావ్యం జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అందాల తార శ్రీదేవి హిరోయిన్ వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా గురించిన రహస్యాలు చెప్పడానికి వైజయంతీ మూవీస్ ముందుకు వచ్చింది.

 

నేచురల్ స్టార్ నాని మాటల్లో ఈ సినిమా గురించి మనకి తెలియని  విషయాలని రివీల్ చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అఖండ విజయం అందుకుని, ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచిన సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పాడు నాని. నిర్మాత అశ్వనీదత్ గారికి ఎప్పటి నుండో భారతీయ సినిమా గర్వపడేలా సోషియో ఫాంటసీ చిత్రం తీయాలని ఉండేదట. ఆ సినిమాని చిరంజీవి హీరోగా, రాఘవేంద్రరావుగారే దర్శకత్వం వహించాలని అనుకున్నాడట. 

 


ఒకసారి రాఘవేంద్రరావుగారు, రచయిత శ్రీనివాస్ చక్రవర్తి గారు తిరుమల వెళ్ళినపుడు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాటల్లో జగదేకవీరుడు కథని ఒక లైన్లో చెప్పాడట. ఒక దేవకన్య తన ఉంగరం పోగొట్టుకుని వెతుక్కోవడానికి భూమ్మీదకి వస్తుంది. ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుందని చెప్పాడట. ఈ లైన్ అశ్వనీదత్ గారికి బాగా నచ్చి, తన ఆస్థాన రచయితలైన యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల, సత్యమూర్తి వాళ్లకి డెవలప్ చేయమని అప్పగించాడట.

 


వాళ్ళు డెవలప్ చేసి జగదేకవీరుడు అతిలోకసుందరిని స్క్రిప్టుని పూర్తి చేశారని నాని చెప్పాడు. ఈ సినిమా లైన్ అనుకున్నప్పుడు హిరోయిన్ గా అందరి మదిలో మెదిలిన ఒకే ఒక్క పేరు శ్రీదేవి అని, సినిమా కోసం ఆమె కాస్ట్యూమ్స్ అన్నీ ముంబయిలో స్వయంగా డిజైన్ చేయించుకుందని చెప్పాడు. ఇంకా అతిలోక సుందరిగా శ్రీదేవి కనిపిస్తుంటే, హీరో మాసినగడ్డంతో ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని చిరంజీవి సలహా ఇచ్చాడట. అయితే సినిమా గురించిన మరిన్ని రహస్యాలని కూడా చెప్పబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: