'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే ఊపుతో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా పట్టాలెక్కించేసాడు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టారు. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతోందనే వార్తలను నిజం చేస్తూ ఫస్ట్ లుక్ లో ఆ అంశాలు ఉండేలా రిలీజ్ చేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తున్నాడు. ఇది ఒక ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో పుష్ప మూవీలో సాంగ్స్ కానీ.. ఆ సాంగ్స్ కి బన్నీ స్టెప్స్ కానీ అదే తరహాలో ఉంటాయట. పల్లెటూరి నేపథ్యంలో యువకుల డాన్స్ స్టైల్ ని ఈ మూవీ కోసం సుకుమార్ అడాప్ట్ చేసుకుంటున్నారట. 'పుష్ప'లో సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా అలానే ఉంటుందని సమాచారం. కావున బన్నీ అల్ర్టా స్టైలిష్ వెస్ట్రన్ మూమెంట్స్ పుష్పలో ఉండవని సమాచారం. 

 

'పుష్ప' మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కూడా భారీగా పలు పరిశ్రమలకు చెందినవారిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నుండి తీసుకుకొనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ముఖ్యంగా సీనియర్ హీరోలు అయిన సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లలో ఎవరినో ఒకరిని ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని సంప్రదిస్తున్నారని సమాచారం. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ఒక మాస్ నెంబర్ రెడీ చేసి సుక్కుకు వినిపించాడట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. లెక్కల మాస్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: