అనుకున్న విధంగా ప్రభుత్వ అనుమతులు లభించి వచ్చే నెల నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలైనా అలియా భట్ డేట్స్ తో సమస్య వచ్చేలా ఉందని దీనివల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే సంక్రాంతికి కాదు సరికదా కనీసం వచ్చే సమ్మర్ కు కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ రావడం కష్టం అంటూ కొన్నిచోట్ల నెగిటివ్ వార్తలు హడావిడి చేయడం మొదలు పెట్టాయి. దీనికితోడు అలియా భట్ ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో పాటు ఈమధ్యనే అలియా ప్రియుడు రణబీర్ కపూర్ తండ్రి రుషీకపూర్ కూడ చనిపోవడంతో షాక్ లో ఉన్న అలియా భట్ డేట్స్ అంత సులువుగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు దొరకడం కష్టం అంటూ ప్రచారం మొదలైంది. 


ఈ వార్తలు అన్నీ రాజమౌళి దృష్టిలో పడటంతో జక్కన్న చాల వ్యూహాత్మకంగా ఈ విషయం పై స్పందించాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి అలియా భట్ నటిస్తున్న సీత పాత్ర చాల కీలకం అని కామెంట్స్ చేస్తూ రామ్ చరణ్ కు నటన పరంగా బలమైన వారధిగా నటించే సమర్థత అలియా కు మాత్రమే ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను ఎంపిక చేసిన విషయాన్ని రాజమౌళి బయటపెట్టాడు. 


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో తాను డిజైన్ చేసిన సీత పాత్ర చాల అమాయకంగా కనిపిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎదురు దాడికి సిద్దపడే మానసిక ధృఢత్వంతో ఉంటుందని అలియా భట్ పాత్రను గురించి లీకులు ఇచ్చాడు. అంతేకాదు అలాంటి పాత్ర ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క అలియా భట్ కు తప్ప మరెవ్వరికి నప్పదు అంటూ వివరించాడు. 


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి అలియా భట్ తన సినిమాల బిజీ వల్ల తప్పుకుంటోంది అని వస్తున్న వార్తల పై చాల తెలివిగా సమాధానం ఇచ్చినట్లు అయింది. అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలు అయిన తరువాత అలియా భట్ డేట్స్ విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు అనే విషయాన్ని చాల వ్యూహాత్మకంగా తెలియచేసాడు అనుకోవాలి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: